ETV Bharat / business

ఎయిర్​ ఇండియా టేకోవర్‌పై ఆనంద్‌ మహీంద్రా ఏమన్నారంటే.. - రతన్‌ ఎన్‌ టాటా ట్వీట్‌

నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్ధ ఎయిర్‌ ఇండియాను.. టాటా సన్స్ సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు. ఈ మేరకు టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్‌ రతన్‌ ఎన్‌ టాటా చేసిన ట్వీట్‌ను జత చేస్తూ ఆనంద్‌ మహీంద్రా రీట్వీట్‌ చేశారు.

anand mahindra
ఆనంద్‌ మహీంద్రా
author img

By

Published : Oct 9, 2021, 11:49 AM IST

Updated : Oct 9, 2021, 4:29 PM IST

ఎయిర్​ ఇండియా పగ్గాలు మళ్లీ టాటా సన్స్‌ చేతికి వెళ్లడాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా స్వాగతించారు. ఈ విమానయాన సంస్థ నుంచి ప్రభుత్వం పెట్టుబడులు ఉపసంహరించుకోవడంతో భారత్‌లో వ్యాపార వాతావరణం పునర్‌వైభవాన్ని సంతరించుకోనుందని అభిప్రాయపడ్డారు. అప్పుల్లో కూరుకుపోయిన ఈ సంస్థను ప్రభుత్వం వదులుకోవడమే కాకుండా.. ప్రైవేటు రంగంపై ఉన్న విశ్వాసాన్ని పునరుద్ధరిస్తోందని వ్యాఖ్యానించారు.

"ఈ టేకోవర్‌ ప్రాముఖ్యతపై నేను చేసే వ్యాఖ్యలు కొంచెం అతిశయోక్తిగా అనిపించొచ్చు. ఈ పెట్టుబడుల ఉపసంహరణ వల్ల భారత వ్యాపార వాతావరణానికి ప్రభుత్వం పునర్‌వైభవం తీసుకొస్తోందని నేను భావిస్తున్నాను. అప్పుల్లో కూరుకుపోయిన సంస్థను ప్రభుత్వం వదులుకుంటోంది. అంతేకాదు, దశాబ్దాల తర్వాత ప్రైవేటురంగ సామర్థ్యంపై ఉన్న విశ్వాసాన్ని పునరుద్ధరిస్తోంది"

-ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌

ఎయిర్​ ఇండియా పగ్గాలు మళ్లీ టాటా సన్స్‌ చేతికి వెళ్లనున్న విషయం తెలిసిందే. అప్పుల్లో కూరుకుపోయిన ఈ సంస్థలో 100 శాతం వాటా పొందేందుకు రూ.18,000 కోట్లతో టాటాలు దాఖలు చేసిన బిడ్‌కు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. టాటాలకు చెందిన ప్రత్యేక సంస్థ(ఎస్‌పీవీ) టాలెస్‌ దాఖలు చేసిన బిడ్‌లో రూ.2700 కోట్ల నగదు; రూ.15,300 కోట్ల రుణాల టేకోవరు (మొత్తం రూ.18,000 కోట్లు) ఉన్నాయని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం(దీపమ్‌) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే శుక్రవారం వివరించారు. డిసెంబరు కల్లా ఈ లావాదేవీ పూర్తవుతుందని తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 9, 2021, 4:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.