అమెరికాలోని సీఈఓలు ఎక్కువ మంది వారి సంస్థలో పని చేసే సాధారణ ఉద్యోగుల కంటే 278 శాతం అధిక వేతనాలు అందుకుంటున్నట్లు ఓ ప్రముఖ సంస్థ నివేదికలో వెల్లడించింది.
ఎకనామిక్స్ పాలసీ ఇన్స్టిట్యూట్ (ఈపీఐ)సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం.. 2018లో అమెరికాలోని 350 పెద్ద కంపెనీల సీఈఓల వేతనాలు సగటున ఏడాదికి 17.2 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. స్టాక్(కంపెనీ షేర్లు) సదుపాయంతో కలిపి ఈ వేతనాలు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. సాధారణంగా వారి ప్యాకేజీలో వీటి శాతం మూడింట రెండొంతులు ఉంటుంది.
1989లో సాధారణ ఉద్యోగులు, సీఈఓల మధ్య వేతన అంతరం 1 నుంచి 58 రెట్లు, 1965లో 1 నుంచి 20 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు ఈపీఐ పేర్కొంది. తక్కువ, మధ్య తరహా ఆదాయం ఉన్న ఉద్యోగులపై దృష్టి సారించి ఈ నివేదికను రూపొందించింది ఈపీఐ.
1978 నుంచి 2018 మధ్య కాలంలో సీఈఓల వేతనాలు 1,000 శాతానికి పైగా వృద్ధి చెందాయి. ఇదే సమయంలో ఉద్యోగుల వేతనాలు 12 శాతం మాత్రమే పెరిగాయి.
"సీఈఓలకు వేతనాలు తక్కువ ఇచ్చినా, అధిక పన్నులు విధించినా ఆర్థిక వ్యవస్థకు వచ్చే నష్టం లేదు. వేతనాల్లో వృద్ధి కారణంగా వారికి నైపుణ్యాలు పెరిగినట్లు కాదు. వేతనాలు పెంచుకునేందుకు వారి అధికారాన్ని వినియోగిస్తున్నారు. ఈ కారణంగా మా దేశంలో వేతనాల్లో వృద్ధి అసమానంగా ఉంది." - ఈపీఐ సర్వే
ఇదీ చూడండి: మోదీ 'సీడీఎస్' నిర్ణయంపై ప్రశంసల జల్లు