ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యూనియన్ బ్యాంకు వినియోగదారులకు శుభవార్త చెప్పింది. మార్జినల్ కాస్ట్ ఫండ్ ఆధారిత రుణ రేటు(ఎంసీఎల్ఆర్)ను తగ్గించింది. ప్రస్తుతం ఉన్న 7.40 శాతం వడ్డీ రేటును 15 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు యూనియన్ బ్యాంక్ ప్రకటించింది. దీనితో వడ్డీ రేటు 7.25 శాతానికి దిగొచ్చింది.
మూడు నెలలు, ఆరు నెలల పరిమితి ఉండే రుణాలపై వడ్డీ రేట్లను 6.95 శాతం, 7.10 శాతానికి సవరించింది యూనియన్ బ్యాంక్.
తగ్గిన వడ్డీ రేట్లు మంగళవారం(ఆగస్టు 11) నుంచే అమలులోకి రానున్నాయి.
2019 జులై నుంచి ఇప్పటి వరకు 14 సార్లు ఎంసీఎల్ఆర్ తగ్గించినట్లు యూనియన్ బ్యాంక్ గుర్తు చేసింది.
ఇదీ చూడండి:కరోనాతో మారిన వినియోగదారుల తీరు