ETV Bharat / business

ఇకపై రాష్ట్రాల వారీగా ట్విట్టర్ 'ఎస్ఓఎస్' - ట్విట్టర్​లో కరోనా సేవలు

కరోనా వైరస్​కి సంబంధించిన అత్యవసర సాయాన్ని అభ్యర్థించే వారితో పాటు.. సేవలను అందించే వారిని అనుసంధానించే ట్విట్టర్ ఎస్​ఓఎస్(అత్యవసర)​​ పేజీని.. ఇకపై రాష్ట్రాల వారీగా అందుబాటులో ఉంచనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇంగ్లీష్​తో పాటు స్థానిక భాషలో చేసే ట్వీట్లు ఈ పేజీలో కనిపిస్తాయని తెలిపింది.

Twitter rolls out state-specific COVID-19 updates in India
ట్విట్టర్
author img

By

Published : May 15, 2021, 8:49 AM IST

దేశం కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్.. మహమ్మారిపై పోరులో మద్దతుగా నిలుస్తోంది. ప్రస్తుతం అందిస్తున్న 'ఎస్​ఓఎస్​'(అత్యవసర) సేవలను అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్నట్లు తెలిపింది.

ఏంటీ ఎస్ఓఎస్!

అత్యవసర సేవలను కోరేవారితో పాటు.. సహాయం అందించే వారి తాజా ట్వీట్లను 'ఎస్ఓఎస్' పేజీలో అందుబాటులో ఉంచుతుంది ట్విట్టర్. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్, దిల్లీ, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలకు ఇదివరకే నిర్దిష్ట పేజీలు ఉండగా.. ఇప్పుడు ప్రతి రాష్ట్రానికీ ప్రత్యేక పేజీని తీసుకురానున్నట్లు తెలిపింది.

ఇంగ్లీష్​తో పాటు రాష్ట్ర అధికారిక భాషలో ఈ ట్వీట్లు అందుబాటులో ఉంటాయని ట్విట్టర్ వెల్లడించింది. స్థానిక మీడియా సహా.. దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల భాగస్వామ్యంతో కచ్చితమైన, తాజా సమాచారాన్ని కొవిడ్-19 పేజీలో పంచుకోనుంది ట్విట్టర్.

ఇవీ చదవండి: 'ప్రైవసీ పాలసీ'పై వెనక్కి తగ్గిన వాట్సాప్!

ట్విట్టర్​లో కొత్తగా 'టిప్​ జార్​' ఫీచర్​

ట్విట్టర్​లో 'బ్లూ టిక్'​ కావాలా? ఇలా చేయండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.