ETV Bharat / business

ఎయిర్​ ఇండియా ఉద్యోగులకు మంత్రి భరోసా - air india disinvestment plan

ఎయిర్​ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియలో ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని పౌరవిమానయాన మంత్రి హర్​దీప్​ సింగ్​ పూరీ ధీమా వ్యక్తంచేశారు. యాజమాన్యం మారినా ఉద్యోగులకు ఎలాంటి నష్టం జరగదని భరోసా ఇచ్చారు.

airindia
ఎయిర్​ఇండియా
author img

By

Published : Feb 17, 2020, 3:09 PM IST

Updated : Mar 1, 2020, 3:02 PM IST

ఎయిర్​ఇండియాలో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో ఈసారి ఎలాంటి ఇబ్బందులు ఉండవని పౌరవిమానయాన మంత్రి హర్​దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు. కొనుగోలు దారులు ఆసక్తి చూపుతుండటమే ఇందుకు కారణమని తెలిపారు. మరిన్ని సంవత్సరాలు ఎయిర్​ఇండియా సేవలందించాలని ఆకాంక్షించారు.

ఎయిర్​ఇండియా ఉద్యోగులకు కూడా భరోసా ఇచ్చారు కేంద్ర మంత్రి. యాజమాన్యం మారినప్పటికీ ఉద్యోగుల ప్రయోజనాలే ప్రాథమ్యాలుగా ఉంటాయని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణలో ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు.

ప్రైవేటీకరణ నేపథ్యంలో తమ భవితవ్యంపై కొన్ని నెలలుగా ఎయిర్​ఇండియా ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమయంలో కేంద్ర మంత్రి ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Last Updated : Mar 1, 2020, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.