ETV Bharat / business

ఈ కరెన్సీలకే అత్యధిక విలువ..! - విదేశీ కరెన్సీ

అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలరునే ప్రామాణికంగా తీసుకుంటుంటారు. ప్రస్తుతం డాలరుతో రూపాయి మారకం విలువ అటు ఇటుగా రూ.72గా ఉంటోంది. అయితే రూపాయి మారకం విలువ డాలరు విలువకు మించి ఎక్కువున్న విదేశీ కరెన్సీలు కూడా ఉన్నాయి.

currencies
కరెన్సీలు
author img

By

Published : Apr 4, 2021, 10:32 AM IST

ప్రపంచంలో 200కుపైగా దేశాలున్నాయి. అయినా అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలరునే ప్రామాణికంగా తీసుకుంటుంటారు. ఎగుమతులు, దిగుమతులు, చెల్లింపులు, కొనుగోళ్ల వంటి లావాదేవీలన్నీ యూఎస్‌ కరెన్సీలోనే జరుగుతుంటాయి. ప్రస్తుతం డాలరుతో రూపాయి మారకం విలువ అటు ఇటుగా రూ.72గా ఉంటోంది. అయితే రూపాయి మారకం విలువ డాలరు విలువకు మించి ఎక్కువున్న విదేశీ కరెన్సీలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దామా..!

కువైట్‌ దినార్‌: ₹239.91

కువైట్‌ చాలా చిన్న దేశం. కానీ, చమురు నిక్షేపాలు అధికంగా ఉండటంతో సంపన్న దేశంగా ఎదిగింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ఎగుమతులు చేసే దేశాల్లో ఇదీ ఒకటి. సౌదీ, ఇరాక్‌, ఇరాన్‌తో సరిహద్దులు పంచుకునే ఈ దేశ అధికారిక కరెన్సీ కువైట్‌ దినార్‌. ఈ కువైట్‌ దినార్‌తో రూపాయి మారకం విలువ రూ.239.91గా ఉంది. ఒక కువైట్‌ దినార్‌.. 3.31యూఎస్‌ డాలర్లతో సమానం.

బహ్రెయిన్: ₹192.27

గల్ఫ్‌ ప్రాంతంలో స్వతంత్ర రాజ్యంగా బహ్రెయిన్‌ కొనసాగుతోంది. దాదాపు 100 దీవులతో కూడిన ఈ దీవి ఎక్కువగా పెట్రోలియంను ఎగుమతి చేస్తూ ఆదాయం పొందుతోంది. ఇక్కడి బహ్రెయిని దినార్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.192.27గా ఉంది. ఒక్క బహ్రెయిని దినార్‌ 2.65డాలర్లతో సమానం.

ఒమన్‌: ₹188.29

అరేబియా సముద్రం తీరాన ఉన్న దేశం ఒమన్‌. సౌదీ, యూఏఈ, యెమెన్‌తో సరిహద్దులను పంచుకుంటుంది. 25లక్షలకుపైగా జనాభా ఉన్న ఒమన్‌లో పెట్రోలియం వనరులు పుష్కలంగా ఉన్నాయి. దీనిపైనే దేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. ఈ దేశ కరెన్సీ.. ఒమన్‌ రియల్‌. దీనితో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.188.29గా ఉంది. ఒక్క ఒమన్‌ రియల్‌ 2.60డాలర్లతో సమానం.

జోర్డాన్‌: ₹102.25

జోర్డాన్‌ ఒక ఎడారి దేశం. సిరియా, ఇరాక్‌, సౌదీ, ఇజ్రాయెల్‌, పాలస్తీనాతో సరిహద్దులు పంచుకుంటుంది. చమురు, పెట్రోలియం ఉత్పత్తులతో వాణిజ్యమే ఆర్థిక వ్యవస్థలో సింహాభాగం వహిస్తాయి. ఈ దేశ కరెన్సీ జోర్డానియన్‌ దినార్‌తో పోలిస్తే రూపాయితో మారకం విలువ రూ.102.25గా ఉంది. ఒక్క జోర్డానియన్‌ దినార్‌ 1.41డాలర్లతో సమానం.

యూకె: ₹100.38

యూకె.. ఇంగ్లాండ్‌, వేల్స్‌, స్కాట్లాండ్‌, ఉత్తర ఐర్లాండ్‌ కలగలిపిన రాజ్యం. ఐరోపాలో బలమైన రాజ్యంగా ఉన్న యూకె అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపించగలదు. ఈ దేశ కరెన్సీ పౌండ్‌ స్టెర్లింగ్‌. దీనితో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 100.38గా ఉంది. ఒక్క పౌండ్‌ స్టెర్లింగ్‌ 1.38డాలర్లతో సమానం. ఇక ఒక్క కేమన్‌ ఐలాండ్స్‌ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹87.07, యూరప్‌ కరెన్సీ యూరోతో పోలిస్తే విలువ ₹86.15, స్విజ్‌ ఫ్రాంక్‌తో పోలిస్తే విలువ ₹77.88 ఉంది.

నోట్‌: కాలంతోపాటు రూపాయితో విదేశీ మారకం విలువ మారుతూ ఉంటుంది. ఈ విలువలు 19-03-2021 నాటితో పోల్చినవి.

ఇదీ చదవండి: జియోగేమ్స్​లో సరికొత్త ఛాలెంజ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.