ETV Bharat / business

సమాచార భద్రతకు సరైన దశ దిశ

ప్రపంచం ఇప్పుడు సమాచారంపై ఆధారపడి ఉంది. దేశంలో అంతర్జాలం అత్యంత చవకగా దొరుకుతోంది. దీంతో విజ్ఞానం ఎలాంటి అడ్డంకులు లేకుండా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రారంభంలో ఆరోగ్యకరమైన పోటీ ముసుగులో టెలికాం సంస్థలు, ప్రభుత్వం రుసుములకు కనీస ధర నిర్ణయించడానికి విముఖత చూపాయి. చందాదారుల సంఖ్యను పెంచుకునేందుకు హేతుబద్ధంకాని రీతిలో ధరల తగ్గింపు వ్యూహాన్ని అనుసరించింది. ఈ విషయంలో ఏదేని వస్తువును/ సేవను ఉత్పత్తి వ్యయంకన్నా తక్కువ ధరకు అమ్మకూడదన్న ప్రాథమిక ఆర్థిక సూత్రాన్ని విస్మరించాయి. ప్రభుత్వం, నియంత్రణ ప్రాధికార సంస్థల నిర్లక్ష్యం ఫలితంగా ఖజానాకు నష్టం వాటిల్లింది.

Telecom companies, initially pursuing healthy competition, have been reluctant to set minimum rates for government fees. This has led to an irreparable decline in earnings.
సమాచారానికి సరైన దశ దిశ
author img

By

Published : Jan 5, 2020, 8:33 AM IST

సమాచారం.. చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన వనరు. సర్వాంతర్యామిలా మారిన అంతర్జాలం- ప్రపంచాన్ని విజ్ఞాన గనిలా మార్చింది. విజ్ఞానం ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. విద్య, పరిశోధన, ఆరోగ్య సంరక్షణ, విశ్వాన్వేషణ, సాంకేతిక పరిజ్ఞానాలు, వ్యాపారాలు, యుద్ధం, శాంతితోపాటు మానవ జీవితానికి సంబంధించి ఎలాంటి విషయంలోనైనా అంతర్జాలం కీలక ఉపకరణంలా స్థిరపడిపోయింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సమృద్ధికి, పేదరిక నిర్మూలనకు దోహదపడింది. ప్రాథమికంగా టెలికాం విధానం లక్ష్యం- ఫోన్‌లో మాట్లాడుకోవడానికే పరిమితమైంది. ఇప్పుడు ఫోన్‌లో అంతర్జాలాన్ని అందించే డేటాకే అధిక ప్రాధాన్యం దక్కుతోంది. స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు సమాచార లభ్యత వ్యసనంలా మారింది. ఎంతగా అంటే, అధికరణ 370 రద్దు తరవాత జమ్మూకశ్మీర్‌లో చాలామంది ఇతరత్రా నిత్యావసరాలకన్నా అంతర్జాల పునరుద్ధరణ కోసమే ఎక్కువగా డిమాండ్‌ చేయడం గమనార్హం. భారతీయుల ఇళ్లలోకి విద్యుత్తు, గ్యాస్‌ ప్రవేశించడానికి ఏడు దశాబ్దాలు పట్టింది. చరవాణులు కేవలం రెండు దశాబ్దాల్లో అందరి చేతుల్లోకి వచ్చేశాయి.

Telecom companies, initially pursuing healthy competition, have been reluctant to set minimum rates for government fees. This has led to an irreparable decline in earnings.
సామాజిక మాధ్యమాల విశ్వరూపం

జాతి భద్రతకూ ప్రమాదం

ప్రస్తుతం ప్రపంచ ఇంధన వినియోగంలో అంతర్జాలం / ఇన్‌ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐసీటీ) వాటా 6-10 శాతంగా ఉంటోంది. ఇది నాలుగు శాతం హరిత గృహ వాయువుల్ని విడుదల చేస్తోంది. దీని పెరుగుదల ఏటా 5-7 శాతందాకా ఉంటోంది. అంతర్జాలాన్ని ఉపయోగించడం అనేది తప్పనిసరి వ్యవహారమే. దీనికోసం మనం నివసించే భూగ్రహాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. మరోవైపు సామాజిక మాధ్యమాలు పెద్ద సవాలుగా పరిణమించాయి. కీలకమైన జాతీయ భద్రత అంశాల్లో ప్రభుత్వాలు సామాజిక మాధ్యమ దిగ్గజాల్ని నిలువరించడం కష్టంగా మారింది. ప్రజాస్వామ్య దేశాల్లో పౌర ఉద్యమాల సందర్భంగా, ప్రభుత్వాలు పోలీసు చర్యతోపాటు ఇలాంటి మాధ్యమాలపై ఆంక్షలకు దిగాల్సి వస్తోంది. సామాజిక మాధ్యమాల వ్యసనం పెచ్చరిల్లడానికి ఉచితంగా, చవగ్గా డేటా అందుబాటులోకి రావడమే కారణం. ఇది సామాజికంగా సుహృద్భావ వాతావరణాన్ని దెబ్బతీయడమే కాకుండా, జాతీయ భద్రతకూ పెనుముప్పుగా పరిణమించింది.

ప్రారంభంలో ఆరోగ్యకరమైన పోటీ ముసుగులో టెలికాం సంస్థలు, ప్రభుత్వం రుసుములకు కనీస ధర నిర్ణయించడానికి విముఖత చూపాయి. ఇది ఆదాయాల పరంగా కోలుకోలేని పతనానికి దారితీసింది. సవరించిన స్థూల ఆదాయం(ఏజీఆర్‌)పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరవాత- ఆర్థిక ఒత్తిడికి గురైన టెలికాం రంగానికి టారిఫ్‌లను పెంచడంద్వారా తోడ్పాటు అందించాలని కోరుతూ వోడాఫోన్‌-ఐడియా, భారతి ఎయిర్‌టెల్‌ సంస్థలు ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. ఈ క్రమంలో అనివార్య పరిస్థితుల్లో 40 శాతందాకా రుసుముల్ని పెంచారు. ఏజీఆర్‌పై సుప్రీంకోర్టు స్పష్టమైన వివరణ ఇస్తూ, ప్రభుత్వానికి ఉన్న బకాయిల్ని తీర్చేయాలని టెలికాం సంస్థలకు స్పష్టం చేసింది. ఆ క్రమంలో పరిశ్రమకు కొంత క్రమశిక్షణ అవసరమని భారతి ఎయిర్‌టెల్‌ పేర్కొంది. ఇదే భారతి ఎయిర్‌టెల్‌- ఆర్‌కామ్‌తో కలిసి చందాదారుల సంఖ్యను పెంచుకునేందుకు హేతుబద్ధంకాని రీతిలో ధరల తగ్గింపు వ్యూహాన్ని అనుసరించింది. ఈ విషయంలో ఏదేని వస్తువును/ సేవను ఉత్పత్తి వ్యయంకన్నా తక్కువ ధరకు అమ్మకూడదన్న ప్రాథమిక ఆర్థిక సూత్రాన్ని విస్మరించారనడంలో సందేహం లేదు.

నష్టానికి ఆరు కారణాలు

ప్రభుత్వం, నియంత్రణ ప్రాధికార సంస్థల నిర్లక్ష్యం ఫలితంగా సర్కారు ఖజానాకు నష్టం వాటిల్లింది. అందుకు ఆరు కారణాలున్నాయి.

  1. లైసెన్స్‌ రుసుములు, స్పెక్ట్రమ్‌, స్పెక్ట్రమ్‌ వినియోగ రుసుము(ఎస్‌యూసీ), అంతర అనుసంధాన వినియోగ రుసుము(ఐయూసీ) వంటి సేవలకు ధరల్ని నిర్ణయించే విషయంలో చాలా ఉదారంగా వ్యవహరించడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గణనీయమైన నష్టం వాటిల్లింది.
  2. రుసుములు ఉదారంగా ఉన్నప్పటికీ, టెలికాం సంస్థలు ఏజీఆర్‌ లెక్కింపుపై వివాదాన్ని లేవనెత్తడంతో అది సుదీర్ఘ న్యాయపోరాటానికి దారితీసింది. 2019 అక్టోబర్‌ 31 నాటికి బకాయిలు పేరుకుపోయాయి. లైసెన్స్‌ రుసుములకు సంబంధించి రూ.92 వేల కోట్లు, ఎస్‌యూసీ కోసం రూ.55 వేల కోట్ల బకాయిలు పేరుకున్నాయి. బకాయిల్ని వెంటనే చెల్లించాలంటూ సుప్రీంకోర్టు టెలికాం సంస్థల్ని ఆదేశించినా, ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి, మరో రెండేళ్ల విరామాన్ని అందించింది.
  3. టెలికాం సంస్థలు అనుసరించిన అనైతిక, అస్థిర వ్యాపార నమూనాలు, వాటి ఆదాయాలకు గండికొట్టాయి. అవి భారీ రుణ ఊబిలో చిక్కుకునేలా చేశాయి. రూ.4.5 లక్షల కోట్లకుపైగా బకాయిలు పేరుకుపోయాయి. ఇది బ్యాంకుల నిరర్థక ఆస్తులు పెరిగిపోయేందుకూ దారితీసింది.
  4. రూ.49 వేలకోట్లకు సంబంధించి ఆర్‌కామ్‌ దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదు. ప్రస్తుత సూచీ ప్రకారం చూస్తే, ఇది 30 శాతంకన్నా తక్కువగానే నష్టం భర్తీ చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
  5. ఈ రంగంలో పలు సంస్థల నిష్క్రమణలు, విలీనాల అనంతరం, ఆర్థిక చిక్కుముడుల ఫలితంగా, డజనుదాకా ఉన్న టెలికాం సంస్థలు మూడుకు తగ్గిపోయాయి.
  6. బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎమ్‌టీఎన్‌ఎల్‌ ప్రభుత్వరంగ సంస్థలు కావడంతో విధాన ప్రణాళిక పరంగా... సమస్థాయి పోరు, మూలధన వ్యయం (క్యాపెక్స్‌), నిర్వహణ వ్యయం(ఓపెక్స్‌) వంటివాటిపై వెనకంజవేశాయి. మనుగడ సాగించలేని స్థాయిలో ఉక్కిరిబిక్కిరయ్యాయి. ఈ క్రమంలో 90 వేల ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌)తో కలుపుకొని రూ.77 వేలకోట్లతో కూడిన పునరుద్ధరణ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొంత ఆలస్యం జరిగినా, టెలికాం సేవలకు కనీస ధర నిర్ణయించేందుకు ఓ సంప్రతింపుల పత్రాన్ని తీసుకొచ్చే దిశగా భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్‌) చర్య తీసుకోవడం మంచి పరిణామమే. టెలికాం సంస్థలు వినియోగదారులకు నిర్దేశిత సేవల నాణ్యత (క్యూఓఎస్‌) పరామితుల మేరకు నాణ్యమైన సేవలు అందించేందుకు పోటీ పడటంపై దృష్టి సారించాలి.

హేతుబద్ధీకరణ అవసరం

చమురుసహా అన్ని రకాల నిత్యావసరాల ధరలు 20 ఏళ్ల వ్యవధిలో రెండు, మూడు రెట్లు పెరిగాయి. ఫోన్‌కాల్‌ ధరలు 92 శాతం, డేటా ధరలు 98 శాతం తగ్గాయి. రిలయన్స్‌ జియో ప్రవేశం తరవాత ప్రతి స్మార్ట్‌ఫోన్‌కు దేశంలో డేటా వినియోగం ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో నెలకు 9.8 గిగాబైట్‌(జీబీ)కు పెరిగింది. అయితే, ఈ వృద్ధి ఉత్పాదకతతో కూడినది కాదు. డేటా అత్యంత చౌకగా అందుబాటులో ఉన్న దేశాల్లో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. అమెరికా 182వ స్థానంలో ఉంది. ప్రతి జీబీ డేటాకయ్యే వ్యయం భారత్‌లో సుమారు రూ.18.54. యూకేలో అది రూ.475, అమెరికాలో రూ.882, దక్షిణ కొరియాలో రూ.1,078గా ఉంది. ప్రపంచ సగటు రూ.608గా ఉంది. 5జీ వాయుతరంగాల కోసం ట్రాయ్‌ నిర్ణయించిన రిజర్వు ధర మెగాహెర్ట్జ్‌కు రూ.492 కోట్లుగా ఉన్నట్లు భారత సెల్యులర్‌ ఆపరేటర్ల సంఘం (సీవోఏఐ) చెబుతోంది. దక్షిణ కొరియా, అమెరికాల ధరకన్నా 30 నుంచి 40 శాతం అధికంగా ఉన్న ఈ ధర ఎంతమాత్రం అంగీకారయోగ్యం కాదు. టెలికాం రంగంతో సంబంధం ఉండే భాగస్వాములందరికీ తోడ్పడే సుస్థిర వ్యాపార వాతావరణాన్ని సృష్టించేందుకు వనరులకు హేతుబద్ధమైన ధరలు నిర్ణయించాలి. ఉత్పత్తికి సరైన ధర కల్పించాలి. తాయిలాలు పంచడాన్ని, రాయితీలు ఇవ్వడాన్ని ఆపాలి.

300 శాతం పెరిగిన మిగితా వ్యయాలు

ఒక సాధారణ పౌరుడికి వ్యక్తిగతంగా లేదా కుటుంబపరంగా టెలికాం ఖర్చులు నెలవారీ బడ్జెట్‌లో సుమారు అయిదు శాతందాకా అవుతాయి. తన బడ్జెట్‌లోని అయిదు శాతం ఖర్చులకు 98 శాతం తగ్గింపును భారతీయ వినియోగదారులు అనుభవించారు. మిగతా 95 శాతం వ్యయాలు మాత్రం గత 20 ఏళ్లలో 300 శాతందాకా పెరిగిపోయాయి. ప్రతి వినియోగదారుడి నుంచి సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) ప్రస్తుతం రూ.130 వద్ద ఉందని, దీన్ని క్రమంగా రూ.300 దాకా తీసుకెళ్లాలని భారతి ఎయిర్‌టెల్‌ సంస్థ చెబుతోంది. ప్రస్తుతమున్న ఫోన్‌కాల్‌, డేటా టారిఫ్‌లను నాలుగు రెట్లు పెంచినా భారతీయ వినియోగదారుపై పెద్దగా భారం పడదు. దీనివల్ల మెరుగుపడే టెలికాం సంస్థల ఆదాయాలు సాంకేతిక పరిజ్ఞాన మార్పులకు తోడ్పడతాయి. పెరిగిన ప్రభుత్వ ఆదాయాలు దేశ సమ్మిళిత అభివృద్ధికి ఉపయోగపడతాయి. వినియోగదారులు సమాచారాన్ని జాగ్రత్తగా ఉపయోగించడం వల్ల ఉత్పాదకత పెరగడం వంటి ప్రయోజనాలూ సిద్ధిస్తాయి.

విచ్చలవిడి వినియోగంతో అనర్థం

అంతర్జాలాన్ని విచ్చలవిడిగా వాడటం వల్ల, లాభాలకన్నా నష్టాలే ఎక్కువగా వాటిల్లుతున్నాయి. ఐవోటీ (ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌) సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉపకరణాల వినియోగం విస్తృత రీతిలో పెరిగిపోయింది. సెన్సర్ల వాడకం సంఖ్య కోట్లలో ఉంది. ఇవన్నీ పెద్దయెత్తున విద్యుత్తు వినియోగిస్తున్నందువల్ల కర్బన ఉద్గారాలు నియంత్రించలేని స్థాయికి చేరుతున్నాయి. భూతాపమూ పెచ్చరిల్లింది. సమాచార నిల్వ, బదిలీ కోసం సుమారు 80 లక్షల డేటా కేంద్రాలు... రౌటర్లు, స్విచ్‌లు, భద్రత ఉపకరణాలు, నిల్వ వ్యవస్థలు, సర్వర్ల వంటి ఉపకరణాల్ని ఉపయోగిస్తాయి. ఇవి పెద్ద మొత్తంలో ఉష్ణాన్ని విడుదల చేస్తాయి. వీటిని చల్లబరిచేందుకు అదనంగా శీతలీకరణ వ్యవస్థలు అవసరం.

- ఎం.ఆర్‌.పట్నాయక్‌
(రచయిత - బీఎస్‌ఎన్‌ఎల్‌, విశాఖ రీజియన్‌ రిటైర్డ్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌)

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: RCDE Stadium, Barcelona, Spain - 4th January 2020
1. 00:00 Ernesto Valverde arrives at press conference
2. 00:15 SOUNDBITE (Spanish): Ernesto Valverde, Barcelona head coach
++TRANSLATION PROVIDED FROM SOURCE++
(What conclusions can you draw from this draw - you weren't able to kill that game off)
"Well it was a very closely fought game - a derby - a lot of tension on the pitch, a lot of emotion. It is like anything. When you are winning ... and when you lose, you are losing and concede an equaliser it is like you have lost the point, and when you are the one that equalises, it is like you have won the game. We weren't able to get upfield with much danger early on and they were using set pieces. They were able to put balls into the box and we were looking for counter-attacks. From one of those they were able to score against us. We were playing very well defensively. In the second half we were able to turn things around and were able to increase our advantage. When we had eleven players on the pitch and when we had ten on the pitch we were still pushing and they were pushing and from one of those moves, they scored their goal. And that left us without the reward of the three points."
3. 01:30 SOUNDBITE (Spanish): Ernesto Valverde, Barcelona head coach
++TRANSLATION PROVIDED FROM SOURCE++
(Do you have the feeling that when it was 2-1, Barcelona lacked the intensity and ambition to kill the game off?)
"I don't think so. I don't think so. I always like our passes to be going forward. We had chances to make it 3-1, when we had eleven players on the pitch - and when we had ten players on the pitch - that is the feeling that I have. Sometimes you are fighting with that feeling that the intention that we had was to control the game a lot, but what we wanted was to attack. I think we had chances. I don't know if it would have happened if Frankie de Jong wasn't sent off. I don't know. I had the feeling that the game was going to go more in our favour."
4. 02:24 SOUNDBITE (Spanish): Abelardo Hernandez, Espanyol coach
++TRANSLATION PROVIDED FROM SOURCE++
(Are you happy with the result today - and the performance?)
"I am very proud - very proud of my players. I think we had a great game against a great side. I think this point is a point for pride, a point for pride in my players. I had a good game. We are in a very difficult situation - for them. Obviously they (the players) are the first who want to change this situation. Today, we competed like a team. We were a team on the pitch. For me, the most important thing is that I think the fans - and I am sure that all those who came out today and those who watched it on TV - were proud of the team. This is turning point to turn this season around."
SOURCE: MediaPro
DURATION: 03:18
STORYLINE:
China forward Wu Lei scored late to give Espanyol a 2-2 draw against 10-man Barcelona in Saturday’s Catalan capital derby between the best and worst teams in the Spanish league.
Barcelona’s third draw in four rounds left it level on points midway through the season with second-place Real Madrid, who beat Getafe 3-0 hours before. Barcelona kept the league lead on goal difference - and Espanyol remained last - after 19 of 38 games.
Wu got the equaliser for Espanyol with two minutes remaining after Luis Suárez had played a key role in putting Barcelona 2-1 ahead. Espanyol were helped when Barcelona midfielder Frenkie de Jong was sent off for a second yellow card with 15 minutes remaining.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.