ETV Bharat / business

'ఇతర సంస్థలు మాతో జట్టు కడితే సంతోషం'

ఇతర సంస్థలతో భాగస్వామ్యాలు, సాంకేతిక బదిలీలు, మడిపదార్థాల సరఫరా పెరిగినప్పుడే టీకా ఉత్పత్తిని పెంచటం సాధ్యమవుతుందని భారత్​ బయోటెక్​ సంయుక్త ఎండీ సుచిత్ర ఎల్ల తెలిపారు. అప్పుడే ప్రపంచానికి సరిపడా వ్యాక్సిన్​ను అందించగలుగుతామని పేర్కొన్నారు. ఈ మేరకు భారత్​-ఈయూ సమావేశంలో ఆమె మాట్లాడారు.

Bharat Biotech joint MD, suchitra ella
'ఇతర సంస్థలు జట్టు కడితే ఎంతో సంతోషం'
author img

By

Published : May 9, 2021, 5:25 AM IST

Updated : May 9, 2021, 7:43 AM IST

ఇతర కంపెనీలతో భాగస్వామ్యాలు, సాంకేతికత బదిలీలు, వివిధ కీలక సామగ్రి, పదార్థాల సరఫరాలు పెరిగినపుడే గిరాకీకి తగ్గట్లుగా టీకా ఉత్పత్తిని పెంచడం సాధ్యమవుతుందని భారత్ బయోటెక్ సంయుక్త ఎండీ సుచిత్ర ఎల్ల పేర్కొన్నారు. శనివారం జరిగిన ఈయూ-ఇండియా బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆమె ఇంకా ఏం మాట్లాడారంటే..

అక్కడ కొవాగ్జిన్ నమోదుకు సిద్ధం

"మేం మా టీకా (కొవాగ్జిన్​)ను అమెరికాలో రిజిస్టర్ చేస్తున్నాం. ఐరోపాలో చేయడానికీ సిద్ధంగా ఉన్నాం. ఈయూలోని కంపెనీలు, అకడమిక్ సంస్థలు మాతో జట్టుకడితే అంత కంటే సంతోషం లేదు. భారత్ లోని 130 కోట్ల జనాభాకు సరిపడా 260 కోట్ల డోసులను తక్కువ సమయంలో అందించలేం. 200 కోట్ల డోసులు కూడా వేగంగా ఇవ్వడం ఏ దేశానికీ సాధ్యం కాని పని. అయితే ఇపుడు ఆ అవసరం ఉంది. మా ప్లాంట్లలో కొత్త సాంకేతికతలను వినియోగించడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకు సాంకేతికత బదిలీ అవసరం అవుతుంది. అపుడు తక్కువ సమయంలో భారత్ కే కాదు.. ప్రపంచానికి టీకా అందించడానికి సాధ్యమవుతుంది."

-సుచిత్ర ఎల్ల, భారత్ బయోటెక్ సంయుక్త ఎండీ

ఐరోపా నుంచి కావాల్సింది ఇవీ..

"ఐరోపా నుంచి సరఫరాల రాక ఆలస్యమవుతోంది. మేం ఫిర్యాదు చేయడం లేదు. కాకపోతే మేం ఆర్డరు పెట్టేవాటికి వచ్చే వాటికి పొంతన ఉండడం లేదు. దేశంలో టీకా తయారీదార్లకు భారీ మొత్తంలో ముడి పదార్థాల అవసరం ఉంది. ఇపుడు ఐరోపా దేశాల నుంచి సాంకేతికత బదిలీ, టీకా తయారీకి కావలసిన ముడి పదార్థాలు కావాలి. పేటెంట్ల సడలింపుల వల్ల కూడా టీకా తయారీదార్లకు సహాయం చేయవచ్చు."అని సుచిత్ర ఎల్ల పేర్కొన్నారు.

ఇదీ చూడండి: పెద్దన్న పాత్ర కోసం బైడెన్ 'పేటెంట్' అస్త్రం!

ఇదీ చూడండి: దేశార్థికంపై కరోనా 2.0 ప్రభావం తక్కువే.. కానీ..

Last Updated : May 9, 2021, 7:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.