సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాల ద్వారా తప్పుడు ప్రచారం, విద్వేష వ్యాప్తి కట్టడికి ఓ యంత్రాంగం ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై.. కేంద్రం, ట్విట్టర్‌కు నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. తమ అభిప్రాయాలు తెలపాలని ఆదేశించింది.
భాజపా నేత వినీత్ గోయెంకా దాఖలు చేసిన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, ప్రముఖుల ఫొటోలతో ట్విట్టర్, ఫేస్బుక్ సహా సామాజిక మాధ్యమాల్లో కొందరు నకిలీ ఖాతాలు సృష్టిస్తున్నారని పిటిషన్లో వివరించారు గోయెంకా. ఇలాంటి ఖాతాలు వందల సంఖ్యలో ఉన్నాయని తెలిపారు. వాటి ద్వారా జరిగే తప్పుడు ప్రచారం దేశంలో అల్లర్లకు మూల కారణం అవుతోందని వివరించారు. అలాంటి వాటి కట్టడికి కేంద్రం ఓ యంత్రాంగం ఏర్పాటు చేసేలా చూడాలని అభ్యర్థించారు.
ఈ అంశంపై ఇప్పటికే దాఖలైన ఇదే తరహా పిటిషన్లతో గోయెంకా అభ్యర్థనను జత చేస్తున్నామని, కేంద్రం, ట్విట్టర్‌కు నోటీసులు జారీ చేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం తెలిపింది.
ఇదీ చూడండి: ట్విట్టర్‌కు మరోమారు కేంద్రం వార్నింగ్!