ETV Bharat / business

ద్రవ్యోల్బణం లెక్కలు, ఫెడ్ నిర్ణయాలే కీలకం! - మార్కెట్లపై ద్రవ్యోల్బణం గణాంకాల ప్రభావం

ద్రవ్యోల్బణం గణాంకాలు, వ్యాక్సిన్ వార్తలు, అమెరికా ఫెడ్​ వడ్డీ రేట్ల ప్రకటన అంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్లను దిశా నిర్దేశం చేయనున్నాయి. అన్​లాక్​ అప్​డేట్స్​ కూడా మార్కెట్లను ప్రభావితం చేసే కీలకాంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Stocks market updates
స్టాక్ మార్కెట్ అంచనాలు
author img

By

Published : Jun 13, 2021, 12:34 PM IST

స్టాక్ మార్కెట్లకు ఈ వారం.. ద్రవ్యోల్బణం గణాంకాలు, కరోనా వ్యాక్సిన్ వార్తలు, లాక్​డౌన్ మినహాయింపు వంటి అంశాలు కీలకం కానున్నాయంటున్నారు నిపుణులు.

మే నెలకు సంబంధించి ద్రవ్యోల్బణం గణాంకాలు ఈ వారం విడుదలవనున్నాయి. దేశీయంగా ఆర్థిక విషయాల్లో ఇది కీలక అంశమని జియోజిత్​ ఫినాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగాధిపతి వినోద్​ నాయర్​ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయం కూడా మార్కెట్లను ప్రభావితం చేసే ప్రధాన అంశమని వివరించారు.

కొవిడ్-19 కేసులు, వాక్సినేషన్ అప్​డేట్స్​పై కూడా మదుపరులు దృష్టి సారించొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వీటన్నింటితో పాటు.. రూపాయి హెచ్చుతగ్గులు, ముడి చమురు ధరలు మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.

ఇదీ చదవండి:ఎలాంటి సందర్భాల్లో పీఎఫ్ విత్​డ్రా చేసుకోవచ్చు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.