ETV Bharat / business

మార్కెట్లపై బేర్​ పంజా- 11 వేల దిగువకు నిఫ్టీ - సెన్సెక్స్

స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 667 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ 174 పాయింట్ల నష్టంతో 11 వేల మార్క్​ను కోల్పోయింది.

stock markets today
నేటి స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : Aug 3, 2020, 3:41 PM IST

స్టాక్ మార్కెట్లపై మళ్లీ బేర్ పంజా విసిరింది. కరోనా భయాలతో సోమవారం సెషన్​లో సూచీలు భారీ నష్టాలను నమోదు చేశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 667 పాయింట్లు కోల్పోయి 36,939 వద్దకు చేరింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 174 పాయింట్ల నష్టంతో 10,900 వద్ద స్థిరపడింది.

ఆరంభం నుంచే నష్టాల్లో ఉన్న సూచీలు ఏ దశ లోనూ కొలుకోలేదు. దాదాపు అన్ని రంగాలు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. బ్యాంకింగ్, సహా హెవీ వెయిట్ షేర్లన్నీ ప్రతికూలంగా స్పందించడం నష్టాలకు ప్రధాన కారణం.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 37,596 పాయింట్ల అత్యధిక స్థాయి, 36,918 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 11,058 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 10,888 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

టైటాన్​, టాటా స్టీల్, హెచ్​సీఎల్​టెక్, ఎల్​&టీ, ఎస్​బీఐ, నెస్లే లాభాలను నమోదు చేశాయి.

ఇండస్​ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఓఎన్​జీసీ, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఆసియా మార్కెట్లు..

హాంకాంగ్ మినహా.. ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు అయిన షాంఘై, టోక్యో, సియోల్​ సూచీలు లాభాలను నమోదు చేశాయి.

రూపాయి..

కరెన్సీ మార్కెట్​లో రూపాయి శుక్రవారం 20 పైసలు క్షీణించింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ రూ.75.01 వద్దకు చేరింది.

ఇదీ చూడండి:40 కోట్ల మార్క్​ దాటిన జన్​ ధన్​ ఖాతాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.