ETV Bharat / business

మాంద్యం భయాలున్నా లాభాల్లో మార్కెట్లు - సెన్సెక్స్

STOCKS UPDATES
మాంద్యం భయాలున్నా లాభాల్లో మార్కెట్లు
author img

By

Published : May 20, 2020, 9:33 AM IST

Updated : May 20, 2020, 10:10 AM IST

08:59 May 20

మాంద్యం భయాలున్నా లాభాల్లో మార్కెట్లు

దేశీయ స్టాక్​మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. కరోనా వ్యాక్సిన్​పై చిగురిస్తున్న ఆశలు మదుపరుల సెంటిమెంట్​ను పెంచడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి 355 పాయింట్లు లాభపడి 30 వేల 551 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి నిఫ్టీ 105 పాయింట్లు వృద్ధిచెంది 8 వేల 985 వద్ద ట్రేడవుతోంది.

అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం కలిగిస్తున్న ఆందోళనలతో దేశాలు రక్షణాత్మక విధానాల వైపు మొగ్గుచూపుతున్నాయి. మరోవైపు కరోనా భయాలు వెంటాడుతునే ఉన్నాయి. అయినప్పటికీ దేశీయ మార్కెట్లు లాభాల బాట పట్టడం గమనార్హం.

లాభనష్టాల్లో

ఐటీసీ, ఎల్​ అండ్ టీ, హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్, టాటా స్టీల్, భారతీ ఎయిర్​టెల్​, రిలయన్స్ రాణిస్తున్నాయి.

హీరో మోటోకార్ప్, ఇండస్​ఇండ్ బ్యాంకు, బజాజ్​ ఫైనాన్స్, ఎస్​బీఐ, టీసీఎస్ నేలచూపులు చూస్తున్నాయి.

ఆసియా మార్కెట్లు

వాల్​స్ట్రీట్​ నష్టాలతో ముగిసింది. ప్రస్తుతం షాంఘై, హాంగ్​కాంగ్​ స్టాక్​మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతుండగా, టోక్యో, సియోల్ లాభాల్లో కొనసాగుతున్నాయి.  

ముడిచమురు ధర

అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర 0.87 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 34.95 డాలర్లుగా ఉంది.

Last Updated : May 20, 2020, 10:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.