ETV Bharat / business

వ్యాక్సిన్​పై ఆశలు- సెన్సెక్స్​ 622 పాయింట్లు ప్లస్ - నిఫ్టీ

దేశీయ స్టాక్​మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. కరోనా వ్యాక్సిన్​పై చిగురిస్తున్న ఆశలు మదుపరుల సెంటిమెంటును పెంచడమే ఇందుకు కారణం. మాంద్యం భయాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణలు మార్కెట్లను ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయి.

stock market closes with gains
భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
author img

By

Published : May 20, 2020, 3:39 PM IST

ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నా, విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళుతున్నా ... దేశీయ స్టాక్​మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. కరోనా వ్యాక్సిన్​పై చిగురిస్తున్న ఆశలే మదుపరుల సెంటిమెంటును పెంచుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 622 పాయింట్లు లాభపడి 30 వేల 818 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 187 పాయింట్లు వృద్ధి చెంది 9 వేల 66 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లో

ఎమ్ అండ్ ఎమ్, హెచ్​డీఎఫ్​సీ, ఎల్​ అండ్​ టీ, బజాజ్​ ఫైనాన్స్, టాటా స్టీల్, సన్​ఫార్మా రాణించాయి.

ఇండస్​ఇండ్ బ్యాంకు, హీరో మోటోకార్ప్, భారతీ ఎయిర్​టెల్, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి.

ఇదీ చూడండి: భారత్​ నుంచి 1600 కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.