ETV Bharat / business

ఆర్​బీఐ వృద్ధి లెక్కలతో మదుపర్లు బేజారు - సెన్సెక్స్

జీడీపీ వృద్ధిరేటు ప్రతికూలంగా ఉండొచ్చన్న ఆర్​బీఐ ప్రకటనతో దేశీయ మార్కెట్లు నష్టపోయాయి. కీలక వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఆర్​బీఐ నిర్ణయం తీసుకున్నప్పటికీ... అది మదుపరులను ఏ మాత్రం సంతృప్తి పరచలేకపోయింది. ఫలితంగా సెన్సెక్స్ 260 పాయింట్లు, నిఫ్టీ 67 పాయింట్ల మేర నష్టపోయాయి.

stock market closes red
వృద్ధి భయాలతో నష్టపోయిన మార్కెట్​
author img

By

Published : May 22, 2020, 3:38 PM IST

జీడీపీ వృద్ధి ప్రతికూలంగా ఉండే అవకాశాలున్నాయని ఆర్​బీఐ చేసిన ప్రకటనతో... దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. కీలక వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఆర్​బీఐ నిర్ణయం తీసుకున్నప్పటికీ... మదుపరులను ఏ మాత్రం సంతృప్తిపరచలేకపోయింది.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 260 పాయింట్లు కోల్పోయి 30 వేల 672 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 67 పాయింట్లు నష్టపోయి 9 వేల 39 వద్ద స్థిరపడింది.

కీలక వడ్డీ రేట్ల తగ్గింపు...

కరోనా సంక్షోభం, లాక్​డౌన్ వల్ల దెబ్బతిన్న భారత ఆర్థిక వ్యవస్థకు ఉపశమనం కలిగించేలా ఆర్​బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. రెపో రేటును 4 శాతానికి, రివర్స్ రెపో రేటును 3.75 శాతానికి పరిమితం చేసింది. టర్మ్ లోన్లపై మారటోరియాన్ని మరో మూడు నెలలు పొడిగించింది. జీడీపీ వృద్ధి ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది.

లాభనష్టాల్లో

ఎమ్​ అండ్ ఎమ్​, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, మారుతి సుజుకి, టెక్​ మహీంద్రా రాణించాయి.

యాక్సిస్ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, రిలయన్స్, ఓఎన్​జీసీ నష్టపోయాయి.

ఆసియా మార్కెట్లు

అమెరికా-చైనా ఉద్రిక్తతలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లు హాంగ్​సెంగ్​, కోస్పీ, నిక్కీ, షాంఘై కాంపోజిట్ తీవ్రంగా నష్టపోయాయి.

ఇదీ చూడండి: 'వడ్డీ రేట్లు తగ్గింపు- ఈఎంఐలపై మారటోరియం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.