ETV Bharat / business

వ్యాక్సిన్​పై ఆశలు.. లాభపడిన మార్కెట్లు - సెన్సెక్స్

నిన్నటి నష్టాల నుంచి తేరుకుని దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ సానుకూలతలు, కరోనా వ్యాక్సిన్​పై ఆశలే ఇందుకు కారణం. సెన్సెక్స్ 167 పాయింట్లు, నిఫ్టీ 55 పాయింట్ల మేర లాభపడ్డాయి.

stock market closes green
లాభాలతో ముగిసిన స్టాక్​మార్కెట్లు
author img

By

Published : May 19, 2020, 3:40 PM IST

అంతర్జాతీయ సానుకూలతలతో దేశీయ స్టాక్​మార్కెట్లు లాభాలతో ముగిశాయి. చమురు ధరలు పుంజుకోవడం, కరోనా వ్యాక్సిన్​పై చిగురిస్తున్న ఆశలు కూడాదీనికి దోహదం చేశాయి. అయితే ప్రారంభంలో భారీ లాభాల్లోకి దూసుకెళ్లిన మార్కెట్లు... చివరకు స్వల్ప లాభాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 167 పాయింట్లు లాభపడి 30 వేల 196 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 55 పాయింట్లు వృద్ధిచెంది 8 వేల 879 వద్ద స్థిరపడింది.

కరోనా మరణాలు, కేసులు పెరుగుతున్న వేళ... వ్యాక్సిన్​ వస్తుందన్న ప్రకటనలు మదుపరుల్లో కొత్త ఆశలను రేకిత్తిస్తున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

లాభనష్టాల్లో

భారతీ ఎయిర్​టెల్, ఓఎన్​జీసీ, ఐటీసీ, ఆల్ట్రాటెక్​ సిమెంట్​, టాటా స్టీల్, టైటాన్, మారుతి సుజుకి రాణించాయి.

ఎల్​ అండ్​ టీ, ఇండస్​ఇండ్ బ్యాంకు, రిలయన్స్, ఎస్​బీఐ, సన్​ఫార్మా, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు నష్టపోయాయి.

ఇదీ చూడండి: మోదీ ప్యాకేజీతో పూర్తిగా గట్టెక్కడం కష్టమే: మూడీస్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.