ETV Bharat / business

టీకా​ రవాణాకు 'స్పైస్​ ఎక్స్​ప్రెస్​'తో షాడోఫాక్స్​ జట్టు

దేశంలో కొవిడ్​-19 వ్యాక్సిన్​ రవాణాకు స్పైస్​జెట్​ విభాగం స్పైస్​ఎక్స్​ప్రెస్​తో కలిసి పనిచేయనున్నట్లు తెలిపింది థర్డ్​పార్టీ రవాణా ప్లాట్​ఫాం షాడోఫాక్స్​. 250కిపైగా రిఫ్రిజిరేడెట్​ వాహనాలను ఉపయోగిస్తామని తెలిపింది. దేశంలోని 500లకు పైగా నగరాల్లో క్షేత్రస్థాయిలో టీకా సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది.

shadow fax
'స్పైస్​ ఎక్స్​ప్రెస్​'తో షాడోఫాక్స్​ జట్టు
author img

By

Published : Dec 19, 2020, 7:27 PM IST

దేశంలో కొవిడ్​ వ్యాక్సిన్​ పంపిణీపై పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వ్యాక్సిన్​ రవాణాలో క్షేత్రస్థాయి సేవలకు స్పైస్​జెట్​ సరకు రవాణా విభాగం స్పైస్​ఎక్స్​ప్రెస్​తో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది థర్డ్​పార్టీ రవాణా ప్లాట్​ఫాం షాడోఫాక్స్​. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది.

ఒప్పందంలో భాగంగా 250కిపైగా రిఫ్రిజిరేటెడ్​ వాహనాలను క్షేత్రస్థాయిలో రవాణా చేసేందుకు మోహరించనున్నట్లు తెలిపింది షాడోపాక్స్​. స్థిరమైన కోల్డ్​చైన్​ ద్వారా వ్యాక్సిన్​ డెలివరీలో వేగవంతమైన, నమ్మకమైన సరఫరా పరిష్కారం లభిస్తుందని వెల్లడించింది.

" కొవిడ్​-19 వ్యాక్సిన్​ పంపిణీలో షాడోఫాక్స్​ రవాణా సదుపాయాలను అందిస్తుంది. దేశంలోని 500లకుపైగా నగరాల్లో గుర్తింపు పొందిన డెలివరీ భాగస్వామ్య నెట్​వర్క్​ల ద్వారా చివరి గమ్యం వరకు చేరవేస్తాం. దేశంలో మొత్తం 7,000 గ్రామాలకు మా సేవలు అందిస్తాం. వ్యాక్సిన్​ రవాణాలో స్పైస్​ఎక్స్​ప్రెస్​తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. సరైన సమయానికి, సురక్షితమైన డెలివరీ కోసం ఇప్పటికే మా సాంకేతికత, సిబ్బంది, డెలివరీ నిపుణులను అప్రమత్తం చేశాం."

- రాహుల్​ కుమార్​, షాడోఫాక్స్​

షాడోఫాక్స్​ క్షేత్రస్థాయిలో వ్యాక్సిన్​ సరఫరా చేస్తుంది. తయారీ దారులు, గిడ్డంగులు, విమానాశ్రయాలు వంటి కోల్డ్​చైన్​ కేంద్రాల నుంచి వ్యాక్సిన్​ సేకరించి.. నిర్ణీత ఉష్ణోగ్రతలతో డెలివరీ పాయింట్లకు చేరవేస్తుంది. దేశవ్యాప్తంగా మొత్తం 500 నగరాల్లో షాడోఫాక్స్​ సేవలందించనుంది.

ఇదీ చూడండి: 'అందుకు వేగవంతమైన టీకా పంపిణీ డ్రైవ్​​ అవసరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.