ETV Bharat / business

భారతీ ఎయిర్‌టెల్​కు సుప్రీంకోర్టు షాక్! - భారతీ ఎయిర్​టెల్​ జీఎస్​టీ రిటర్న్​

భారతీ ఎయిర్​టెల్​కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జీఎస్‌టీ రిటర్న్‌ల సర్దుబాట్లు ద్వారా భారతీ ఎయిర్‌టెల్‌కు రూ.923 కోట్ల పన్ను రీఫండ్‌ను చెల్లించడంపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్​​ విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

Bharti Airtel
భారతీ ఎయిర్‌టెల్​
author img

By

Published : Oct 28, 2021, 12:56 PM IST

భారతీ ఎయిర్​టెల్​కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. 2017 జులై-సెప్టెంబరు జీఎస్‌టీ రిటర్న్‌ల సవరణ ద్వారా భారతీ ఎయిర్​టెల్​ రూ.923 కోట్ల పన్ను రీఫండ్ చేయడంపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్​ విచారణకు సుప్రీంకోర్టు ఆమోదించింది.​​

2020 మే నెలలో అదనపు జీఎస్​టీని భారతీ ఎయిర్​టెల్​కు రెండు నెలల్లోనే చెల్లించాలని దిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్​ చేస్తూ.. ఈ ఏడాది జులైలో సుప్రీం కోర్టును ఆశ్రయించింది కేంద్రం. తాజాగా దీనిపై స్పందించిన ధర్మాసనం విచారణకు ఆమోదం తెలిపింది. ఫలితంగా భారతీ ఎయిర్​టెల్​ షేరు ధర రూ.8 మేర నష్టపోయి రూ.695 వద్ద ట్రేడవుతోంది.

ఇదీ అసలు విషయం

2017 జులై-సెప్టెంబరు త్రైమాసికంలో జీఎస్​టీఆర్​-2ఏ ఫారం సరిగా పనిచేయనందున అంచనాల ఆధారంగా ఇన్‌పుట్‌లపై రూ.923 కోట్లు అదనపు పన్ను చెల్లించినట్లు ఎయిర్​టెల్​ తెలిపింది. అయితే టెలికాం సంస్థ.. ఇన్‌పుట్​ ట్యాక్స్​​ క్రెడిట్​ను తక్కువగా నివేదించినట్లు కేంద్రం చెబుతోంది.

ఇదీ చూడండి: Fuel Price Today: పెట్రో మోత- మళ్లీ పెరిగిన చమురు ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.