ETV Bharat / business

'కరోనా వేరియంట్​ ఏదైనా.. స్పుత్నిక్ టీకాతో ఖతం!'

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి​ వ్యాక్సిన్​ సెప్టెంబర్​ నుంచి భారత్​లో ఉత్పత్తి కానుంది. ఈ మేరకు ఫార్మా దిగ్గజం సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు... కరోనా వైరస్​ అన్ని వేరియంట్లపైనా స్పుత్నిక్-వి టీకా సమర్థంగా పనిచేస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది.

SERUM
సీరం స్పుత్నిక్
author img

By

Published : Jul 13, 2021, 3:45 PM IST

Updated : Jul 13, 2021, 5:08 PM IST

రష్యాకు చెందిన స్పుత్నిక్-వి టీకా ఉత్పత్తిని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) సెప్టెంబరులో ప్రారంభించనుంది. ఈ సంస్థలో వ్యాక్సిన్ తయారీకి కావాల్సిన మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) మంగళవారం తెలిపింది. భారత్​లో ఏడాదికి 300 మిలియన్ డోసులు ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించింది.

టీకా సాంకేతిక బదిలీ ప్రక్రియలో భాగంగా.. ఇప్పటికే గమలేయ ఇన్​స్టిట్యూట్ నుంచి సెల్, వెక్టార్ నమూనాలను అందుకుంది సీరం సంస్థ. వీటి దిగుమతిని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదించింది. దీనితో ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభమైనట్లు ఆర్​డీఐఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల మొదటి వారంలో భారత్​లో స్పుత్నిక్-వి టీకా ఉత్పత్తి కోసం సీరమ్ సంస్థకు డీసీజీఐ అనుమతులు లభించాయి.

వేరియంట్ ఏదైనా..

కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌లు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చినప్పటికీ.. కొత్తగా వెలుగు చూస్తోన్న వేరియంట్లు మాత్రం టీకాల పనితీరుకు ఓ సవాలుగా మారుతున్నాయి. ఇప్పటికే వినియోగిస్తోన్న టీకాలు కొన్ని వేరియంట్లను ఎదుర్కోగలుగుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. తాజాగా రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ కూడా కొత్తగా బయటపడుతోన్న వేరియంట్లను తటస్థీకరించడంలో సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లు తొలుత వుహాన్‌లో వెలుగుచూసిన వైరస్‌ స్ట్రెయిన్‌ ఆధారంగా రూపొందించారు. కానీ, రోజురోజుకు రూపాంతరం చెందుతోన్న వైరస్‌, ప్రమాదకర వేరియంట్లుగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఆల్ఫా, బీటా, గామాతో పాటు అత్యంత ప్రమాదకరమైందిగా భావిస్తోన్న డెల్టా వేరియంట్‌ను తటస్థీకరించడంలో స్పుత్నిక్‌-వి మెరుగైన పనితీరు కనబరుస్తున్నట్లు వ్యాక్సిన్‌ తయారీ సంస్థ ఆర్‌డీఐఎఫ్‌ వెల్లడించింది. ఇందుకోసం స్పుత్నిక్‌ టీకా తీసుకున్నవారి రక్త నమూనాలను సేకరించి పరిశీలించినట్లు తెలిపింది.

ఇదీ చదవండి : స్పుత్నిక్​-వి ఉత్పత్తి కోసం సీరం​ దరఖాస్తు!

'దేశంలో 68శాతం కేసులు తగ్గాయ్​'​

Last Updated : Jul 13, 2021, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.