ETV Bharat / business

కొవిషీల్డ్ ధర పెంపును సమర్థించుకున్న సీరం

author img

By

Published : Apr 24, 2021, 5:31 PM IST

కొవిషీల్డ్ టీకా ఇప్పటికీ అందుబాటు ధరలోనే ఉందని సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పేర్కొంది. తాము నిర్ణయించిన టీకా ధర.. కొవిడ్​పై పోరాడేందుకు వినియోగిస్తున్న అనేక పరికరాలు, చికిత్స ధరల కన్నా తక్కువేనని పేర్కొంది. పెట్టుబడులు పెంచిన కారణంగా ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది.

Serum Institute defends Covid vaccine pricing
కొవిషీల్డ్ ధర పెంపును సమర్థించుకున్న సీరం

కొవిషీల్డ్ టీకా ధరను.. ముందుగా నిర్ణయించిన ధరతో పోలిస్తే 1.5 రెట్లు పెంచడాన్ని సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సమర్థించుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400, ప్రైవేటు వ్యక్తులకు రూ.600గా ఒక్క డోసు ధర నిర్ణయించడాన్ని వెనకేసుకొచ్చింది. కేంద్రానికి డోసుకు రూ.150 వసూలు చేసిన సీరం.. ఆ ధరను ముందస్తు ఫండింగ్ ఆధారంగా నిర్ణయించినట్లు పేర్కొంది. ఇప్పుడు పెట్టుబడిని గణనీయంగా పెంచాల్సి వచ్చిందని, మరిన్ని డోసుల కోసం సామర్థ్యాన్ని బలోపేతం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించింది.

"వ్యాక్సిన్ అంతర్జాతీయ ధరలను భారత్​లో అసంబద్ధంగా పోల్చి చూస్తున్నారు. కొవిషీల్డ్ టీకా ఇప్పటికీ మార్కెట్​లో అందుబాటు ధరలోనే ఉంది. టీకా తయారు చేసుకోలేని దేశాలు అందించిన ముందస్తు ఫండింగ్ ఆధారంగా అంతర్జాతీయంగా టీకా ధరలు ప్రారంభంలో తక్కువగా ఉన్నాయి. భారత్ సహా ఇతర ప్రభుత్వాల కార్యక్రమాలకు సరఫరా ధర ప్రారంభంలో తక్కువగానే ఉంది. ప్రస్తుతం పరిస్థితి అస్థిరంగా ఉంది. వైరస్ మ్యూటేషన్లు పెరిగిపోతున్నాయి. దీని కోసం సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాల్సి ఉంటుంది."

-సీరం ప్రకటన

చాలా తక్కువ మోతాదు టీకాలనే ప్రైవేటు ఆస్పత్రులకు విక్రయిస్తామని సీరం వెల్లడించింది. తాము నిర్ణయించిన టీకా ధర.. కొవిడ్​పై పోరాడేందుకు వినియోగిస్తున్న అనేక పరికరాలు, చికిత్స ధరల కన్నా తక్కువేనని పేర్కొంది.

ఇదీ చదవండి- 'లీడ్​ఇట్​'లోకి అమెరికా- స్వాగతించిన భారత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.