39,600లకు చేరువలో సెన్సెక్స్..
అంతర్జాతీయ సానుకూలతలతో వరుసగా నాలుగో రోజూ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 601 పాయింట్లు పుంజుకుని.. 39,574 వద్దకు చేరింది. నిఫ్టీ 159 పాయింట్ల లాభంతో 11,662 వద్ద స్థిరపడింది.
హెచ్డీఎఫ్సీ అత్యధికంగా 7 శాతానికిపైగా లాభపడింది. ఎం&ఎం, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
టాటా స్టీల్, నెస్లే, ఎల్&టీ, సన్ ఫార్మా షేర్లు నష్టపోయాయి.