దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. ఉత్పత్తి రంగ కార్యకలాపాలు 8 ఏళ్ల గరిష్ఠానికి చేరుకున్నాయన్న సానుకూల వార్తలే ఇందుకు కారణం. ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష జరుగుతున్నా మదుపరులు దూకుడు ప్రదర్శిస్తుండడం గమనార్హం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 783 పాయింట్లు లాభపడి 40,655 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 236 పాయింట్లు వృద్ధి చెంది 11,944 వద్ద ట్రేడవుతోంది.
లాభాల్లో ఉన్న షేర్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ ట్విన్స్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హీరో మోటర్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
నష్టాల్లో ఉన్న షేర్లు
బజాజ్ ఆటో, ఎస్ బ్యాంకు, హిందూస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
బలపడిన రూపాయి
డాలరు మారకం ధరతో పోల్చితే రూపాయి విలువ 17 పైసలు బలపడి 71.20 వద్ద కొనసాగుతుంది.
ముడిచమురు
బ్యారెల్ ముడిచమురు ధర 0.51 శాతం పెరిగి 54.73 వద్ద ఉంది.
ఆసియా మార్కెట్లు
షాంఘై, హాంకాంగ్, టోక్యో, సియోల్ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ఇదీ చూడండి: 'ప్రపంచమంతా కరోనాకు వ్యతిరేకంగా పోరాడాలి'