ETV Bharat / business

ప్యాకేజీపై భారీ ఆశలు- ఫుల్​ జోష్​లో మార్కెట్లు​

Singer Bryan Adams shared an expletive-loaded rant on Instagram blaming wet market vendors for coronavirus pandemic, which led many on social to call the singer out for being racist.

sensex
ప్యాకేజీపై భారీ ఆశలతో మార్కెట్ జోష్​- సెన్సెక్స్ 800 ప్లస్​
author img

By

Published : May 13, 2020, 9:31 AM IST

Updated : May 13, 2020, 10:22 AM IST

10:18 May 13

ప్యాకేజీతో మార్కెట్లకు ఊపు

దేశీయ స్టాక్​మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ మార్కెట్లను పరుగులు పెట్టిస్తోంది.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 664 పాయింట్లు లాభపడి 32 వేల 35 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 188 పాయింట్లు వృద్ధిచెంది 9 వేల 385 వద్ద ట్రేడవుతోంది.

మార్కెట్లకు ప్యాకేజీ ఊపు

దేశ జీడీపీలో 10 శాతం అంటే రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీ.. స్థానికతకు, ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేయనున్నామని స్పష్టం చేశారు. ఈ  ప్రకటన మదుపర్ల సెంటిమెంటును పెంచింది. మరోవైపు నేడు ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించనున్న నేపథ్యంలో మదుపర్లు వాటిపై దృష్టి సారించారు. ఫలితంగా ప్రారంభ ట్రేడింగ్​లో సెన్సెక్స్ 1,400 పాయింట్ల వరకు పెరిగింది.

లాభనష్టాల్లో..

ఐసీఐసీఐ బ్యాంకు 7 శాతం వరకు లాభపడి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఎల్​ అండ్ టీ, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, హీరో మోటోకార్ప్, ఎమ్​ అండ్​ ఎమ్​, ఆల్ట్రాటెక్ సిమెంట్​, మారుతి సుజుకి రాణిస్తున్నాయి.

నెస్లే ఇండియా, భారతీ ఎయిర్​టెల్​, సన్​ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్​, టీసీఎస్, విప్రో నేలచూపులు చూస్తున్నాయి.

ఆసియా మార్కెట్లు..

కరోనా వైరస్ మరో మారు విజృంభిస్తున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లు షాంఘై, హాంగ్​కాంగ్​, టోక్యో, సియోల్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. వాల్​స్ట్రీట్ కూడా నష్టాలతో ముగిసింది.

ముడిచమురు

అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర 1.53 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 29.52 డాలర్లుగా ఉంది.

09:21 May 13

ప్యాకేజీపై భారీ ఆశలతో మార్కెట్ జోష్​- సెన్సెక్స్ 800 ప్లస్​

దేశీయ స్టాక్​మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ మార్కెట్లను పరుగులు పెట్టిస్తోంది.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 870 పాయింట్లు లాభపడి 32 వేల 241 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 249 పాయింట్లు వృద్ధిచెంది 9 వేల 445 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో..

వేదాంత, ఐసీఐసీఐ బ్యాంకు, మారుతి సుజుకి, ఎన్​టీపీసీ, యాక్సిస్ బ్యాంకు రాణిస్తున్నాయి.

నెస్లే ఇండియా, టీసీఎస్, విప్రో నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : May 13, 2020, 10:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.