ETV Bharat / business

ఆర్థిక రంగం అండతో రెండో రోజూ అదే జోరు

ఆర్థిక రంగం అండతో నేడూ లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 371 పాయింట్లు పుంజుకుని 32 వేల ఎగువకు చేరింది. నిఫ్టీ 99 పాయింట్ల లాభంతో 9,381 వద్ద స్థిరపడింది.

STOCK MARKETS TODAY
నేటి స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Apr 28, 2020, 3:47 PM IST

స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 371 పాయింట్లు బలపడి 32,114 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 99 పాయింట్లు పెరిగి 9,381 వద్దకు చేరింది.

నేటి సెషన్​ ప్రారంభమైన కొద్దిసేపటికే అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న సూచీలు.. ఒక దశలో భారీ నష్టాలనూ నమోదు చేశాయి. అయితే ఒత్తిడిలోనూ ఆర్థిక రంగ షేర్లు సానుకూలంగా స్పందించి నేటి లాభాలకు దన్నుగా నిలిచాయి.

అమెరికాలో పలు రాష్ట్రాలు క్రమంగా లాక్​డౌన్ ఎత్తివేసేందుకు సిద్ధమవుతుండటం.. మదుపర్లపై సానుకూల ప్రభావం చూపింది. ఈ అంశం కూడా నేటి లాభాలకు కలిసొచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 32,164 పాయింట్ల అత్యధిక స్థాయి, 31,661 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 9,402 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 9,260 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఇండస్​ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, హెచ్​డీఎఫ్​సీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.

సన్​ఫార్మా, నెస్లే ఇండియా, ఎన్​టీపీసీ, హెచ్​సీఎల్​టెక్, బజాజ్ ఆటో షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

రూపాయి..

రూపాయి నేడు 6 పైసలు బలపడింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ 76.18కి చేరింది.

ఇదీ చూడండి:'అక్టోబర్​ నుంచి అమెరికా ప్రగతి రథం పరుగులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.