స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా మార్కెట్ల బలహీన సంకేతాలతో సూచీలు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 135 పాయింట్లు కోల్పోయింది. ప్రస్తుతం... 38 వేల 43 వద్ద ఉంది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 44 పాయింట్లు క్షీణించింది. 11 వేల 279 వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లోనివివే...
గ్రేసిమ్, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఆరంభ లాభాలను నమోదుచేశాయి.
ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ ట్విన్స్, ఎస్ బ్యాంక్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫినాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ డీలా పడ్డాయి.
మిగతా ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్, టోక్యో సూచీలు సానుకూలంగా కొనసాగుతున్నాయి. అమెరికా, చైనాల మధ్య మరోదశ వాణిజ్య చర్చలపై మదుపరులు ఆసక్తి కనబరుస్తున్నారు.
రూపాయి...
రూపాయి నేటి ట్రేడింగ్‌లో స్వల్పంగా మెరుగుపడింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ ప్రస్తుతం... 12 పైసలు వృద్ధి చెంది 70.95గా ఉంది.