ETV Bharat / business

ఎస్బీఐ వినియోగదారులకు శుభవార్త.. వడ్డీ రేట్లు తగ్గింపు - స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్​ దిగ్గజం స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ రెపో రేటును 75 బేసిస్​ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో ఆ ప్రయోజనాన్ని తమ ఖాతాదారులకు అందించాలని నిర్ణయించింది. ఈబీఆర్​, ఆర్​ఎల్​ఎల్​ఆర్​కు అనుసంధానమైన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నట్లు తెలిపింది. ఏప్రిల్​ 1 నుంచి ఆదేశాలు అమలులోకి రానున్నాయని స్పష్టం చేసింది.

SBI passes on entire repo rate cut to borrowers
ఎస్బీఐ వినియోగదారులకు శుభవార్
author img

By

Published : Mar 28, 2020, 5:15 AM IST

స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. ఆర్బీఐ రెపో రేటును 75 బేసిస్​ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఏప్రిల్​ 1 నుంచి అమలులోకి రానుంది.

దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మాంద్యం పరిస్థితులను అధిగమించేందుకు రిజర్వ్​ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. రెపో రేటును 75 బేసిస్​ పాయింట్లు తగ్గించింది. ఆర్బీఐ నిర్ణయం వెలువడిన కొన్ని గంటల్లోనే ఎస్బీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకోవటం గమనార్హం.

దీంతో పాటు 20-100బేసిస్​ పాయింట్ల​ మధ్య ఉన్న రిటైల్​, పెద్ద మొత్తంలోని డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు ఓ ప్రకటన చేసింది ఎస్బీఐ.

" ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటును అందించేందుకు ఆర్బీఐ అసాధారణ ద్రవ్య విధాన చర్యలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. పూర్తిస్థాయి 75 బెసిస్​ పాయింట్ల రెపో రేట్​ కోతను ఎక్స్​టర్నల్​ బెంచ్​మార్క్​ ఆధారిత లెండింగ్ రేటు​ (ఈబీఆర్​)తో పాటు రెపో ఆధారిత లెండింగ్​ రేటు (ఆర్​ఎల్​ఎల్​ఆర్​)తో అనుసంధానమైన రుణాలకు వర్తింప చేయనున్నాం."

- ఎస్బీఐ.

తాజా నిర్ణయంతో ఈబీఆర్​ వడ్డీ రేటు ఏడాదికి 7.80 శాతం నుంచి 7.05కి చేరనుంది. ఆర్​ఎల్​ఎల్​ఆర్​ వడ్డీ రేటు ఏడాదికి 7.40 శాతం నుంచి 6.65శాతానికి పడిపోనుంది. రుణ రేట్లు ప్రస్తుత తగ్గింపుతో ఈబీఆర్​, ఆర్​ఎల్​ఎల్​ఆర్​కు అనుసంధానమైన 30 ఏళ్ల గృహ రుణాల ఈఎమ్​ఐలు రూ.లక్షకు రూ.52గా ఉండనుంది.

అయితే.. మార్జినల్​ కాస్ట్​ ఆఫ్​ లెండింగ్​ రేట్ల (ఎంసీఎల్​ఆర్​)పై వచ్చే నెలలో జరగబోయే బ్యాంకు అసెట్​ లయబిలిటీ కమిటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది ఎస్బీఐ.

ఇదీ చూడండి: 'స్పష్టంగా తెలుస్తోంది.. మాంద్యంలోకి జారుకున్నాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.