అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్... ఎస్బీఐ మరోమారు రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించింది. ఎమ్సీఎల్ఆర్ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు ప్రకటించింది.
ఫలితంగా ఇప్పటివరకు 8.15 శాతంగా ఉన్న ఎమ్సీఎల్ఆర్... తాజా తగ్గింపుతో 8.05 శాతానికి చేరింది. కొత్త రేట్లు గురువారం నుంచే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది భారతీయ స్టేట్ బ్యాంక్. రెపోతో అనుసంధానమైన రుణాలకు ఈ తగ్గింపు వర్తించదని పేర్కొంది.
ఎస్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ రేట్లు తగ్గించడం ఇది ఆరోసారి.
" పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని అన్ని విభాగాలలోని వినియోగదారులకు ప్రయోజనాలను విస్తరించడానికి ఎంసీఎల్ఆర్ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించాం."
- ఎస్బీఐ
గత వారం రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులు.. రెపోరేటుకు అనుగుణంగా వడ్డీ రేట్లు సవరించాలని ఆర్బీఐ కోరింది.
ఇదీ చూడండి: పన్ను మదింపు ఇక ఆన్లైన్లో చేసుకోవచ్చు..