ETV Bharat / business

కరోనా ఎఫెక్ట్​: మూడు ఎస్​బీఐ బ్రాంచ్​లు బంద్​ - ఎస్​బీఐ బ్రాంచ్​లు మూత

భారత్​లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. మహారాష్ట్రలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ముంబయి స్టేట్​ బ్యాంక్ ఆఫ్​​ ఇండియాలో పనిచేస్తోన్న ఎనిమిది మంది సిబ్బందికి వైరస్​ సోకింది. ఫలితంగా వీరు విధులు నిర్వహిస్తోన్న మూడు శాఖలను తాత్కాలికంగా మూసివేసింది ఎస్​బీఐ.

SBI closes 3 branches in Mumbai, Thane after spike in COVID cases among staff
కరోనా ఎఫెక్ట్​: మూడు ఎస్​బీఐ బ్రాంచ్​లు బంద్​
author img

By

Published : Jun 14, 2020, 8:17 PM IST

దేశంలో వైరస్​ విజృంభణ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కరోనా కారణంగా దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్​ ఎస్​బీఐ.. తన మూడు శాఖలను తాత్కాలికంగా మూసివేసింది. మహారాష్ట్రలో ఇటీవల నిర్వహించిన కొవిడ్​ పరీక్షల్లో 8 మంది బ్యాంక్ సిబ్బందికి పాజిటివ్​గా తేలింది. ఈ నేపథ్యంలో ముంబయిలోని రెండు బ్రాంచ్​లు సహా.. ఠానే సమీపంలోని ఓ శాఖను మూసివేస్తున్నట్లు ప్రకటించింది ఎస్​బీఐ.

గతవారం ఠానేలోని స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఎస్​బీఐ) ప్రధాన శాఖలో పనిచేస్తోన్న 25 మందిలో ఏడుగురు సిబ్బందికి వైరస్​ సోకగా బ్యాంక్​ను మూసివేశారు.

నిత్యం పర్యవేక్షణలో..

తమ సంస్థ ఉద్యోగుల్లో వైరస్​ బాధితులు ఎక్కువవుతున్నారని పేర్కొంది ఎస్​బీఐ. అయితే వారు కోలుకుంటున్నారని తెలిపింది. ఇందుకోసం ఎస్​బీఐ జనరల్​ మేనేజర్​ అధ్వర్యంలోని ఓ బృందం.. దేశంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని స్పష్టం చేసింది. ప్రొటోకాల్​ను తప్పనిసరిగా పాటిస్తున్నట్లు చెప్పింది.

కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు ముగ్గురు ఎస్​బీఐ ఉద్యోగులు మరణించారు. విచారం వ్యక్తం చేసిన ఎస్​బీఐ.. వారికి బ్యాంకు తరఫున పరిహారం, కొవిడ్ పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేసింది.

11 మంది బ్యాంకు ఉద్యోగులు మృతి..

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 11 మంది బ్యాంకు ఉద్యోగులు కరోనా సోకి మరణించారు. వీరిలో ఎస్​బీఐలో ముగ్గురు, బ్యాంక్​ ఆఫ్​ ఇండియాలో ఇద్దరు కాగా.. పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​, ఫెడరల్​ బ్యాంక్​, సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, ఐడీబీఐ, కెనరా బ్యాంక్​, బ్యాంక్​ ఆఫ్​ మహారాష్ట్రలలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: కరోనా వేళ బంగారంపై పెట్టుబడి మంచిదేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.