ETV Bharat / business

భారత్​కు అండగా ఉంటామని పిచాయ్​, నాదెళ్ల హామీ

కరోనా విలయంతో అతలాకుతలం అవుతున్న భారత్​కు.. గూగుల్​ భారీ సహాయాన్ని ప్రకటించింది. వైద్య పరికరాల కొనుగోలుకు రూ.135 కోట్ల విరాళాలు సమకూర్చింది. ఈ పరిస్థితుల నుంచి భారత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. మరోవైపు భారత్​లో నెలకొన్న కరోనా సంక్షోభం పట్ల మైక్రోసాఫ్ట్​ సీఈఓ సత్య నాదెళ్ల ఆందోళన వ్యక్తం చేశారు. భారత్​కు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు మైక్రోసాఫ్ట్ సిద్ధంగా ఉందని ప్రకటించారు.

satya nadella and sundar pichai
సత్యనాదెళ్ల, సుందర్ పిచాయ్
author img

By

Published : Apr 26, 2021, 11:19 AM IST

Updated : Apr 26, 2021, 11:52 AM IST

రోజురోజుకు విజృంభిస్తున్న కరోనాతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న భారత్ త్వరగా కోలుకోవాలని సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఆకాంక్షించారు. భారత్​లో కొవిడ్.. తీవ్ర వినాశనాన్ని సృష్టిస్తోందన్నారు.

"భారత్​కు అవసరమైన​ వైద్య సామాగ్రి కొనుగోలు కోసం 'గివ్ ఇండియా' ఫౌండేషన్​తో పాటు.. యునిసెఫ్​కు​ గూగుల్​ రూ.135 కోట్ల నిధులు సమకూర్చింది. దీనికి గూగుల్​ ఉద్యోగులు సైతం తమ వంతు సహకారం అందించారు."

-సుందర్​ పిచాయ్, గూగుల్ సీఈఓ

అలాగే ఈ కరోనా సమయంలో అవసరమైన కీలక సమాచారాన్ని వ్యాప్తి చేసేందుకు గూగుల్ నిధులను అందిస్తుందని సుందర్ పిచాయ్ వివరించారు. ముఖ్యంగా కరోనా ముప్పు అధికంగా ఉన్న వారికి సహకారం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

సత్య నాదెళ్ల సందేశం..

భారత్​లో పెరిగిపోతున్న కరోనా కేసుల పట్ల అంతర్జాతీయ టెక్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల విచారం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

"భారత్​లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే నా హృదయం తల్లడిల్లిపోతోంది. భారత్​కు సహాయం అందించేందుకు అమెరికా ప్రభుత్వం ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు. సహాయక చర్యల కోసం తగిన వనరులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని మైక్రోసాఫ్ట్ అందిస్తుంది. కరోనా చికిత్సలో కీలకంగా మారిన ఆక్సిజన్ పరికరాల కొనుగోలుకు సహకరిస్తుంది."

-సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ సీఈఓ

ఇవీ చదవండి: 'కొవిడ్​ అంతమైనా ఆన్​లైన్​ బోధన ఆగదు'

ప్రవాస ఆసియన్లపై దాడుల పట్ల సత్య నాదెళ్ల విచారం

Last Updated : Apr 26, 2021, 11:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.