దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్... 5జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా టెక్నాలజీతో కొత్తశ్రేణి ఫ్లాగ్షిప్ ఫోన్ 'గెలాక్సీ ఎస్ 20 సిరీస్'ని ఆవిష్కరించింది. హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి శాంసంగ్ దీన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం యాపిల్, వన్‌ప్లస్‌ల నుంచి శాంసంగ్ గట్టిపోటీని ఎదుర్కొంటోంది.
"ఈ కొత్త దశాబ్దంలో కమ్యూనికేషన్ వ్యవస్థను '5జీ' పూర్తిగా మార్చివేయనుంది. అందుకే గెలాక్సీ ఎస్20 వేరియంట్లు-గెలాక్సీ ఎస్ 20, గెలాక్సీ ఎస్ 20+, గెలాక్సీ ఎస్ 20 ఆల్ట్రాలను 5జీ కనెక్టివిటీతో తీసుకొస్తున్నాం."
- టీఎం రోహ్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రెసిడెంట్, మొబైల్ కమ్యూనికేషన్స్ బిజినెస్ హెడ్
సురక్షితం
శాంసంగ్ 'అన్ప్యాక్డ్ 2020' కార్యక్రమంలో గెలాక్సీ ఎస్ 20 సిరీస్‌ను ఆవిష్కరించింది. ఇందులో హార్డ్‌వేర్ ఆధారిత దాడుల నుంచి రక్షించే సరికొత్త, సురక్షితమైన ప్రాసెసర్ వాడినట్లు పేర్కొంది.
కెమెరా పనితనం
గెలాక్సీ ఎస్ 20 సిరీస్ ఫోన్లలోని కెమెరాల రిజల్యూషన్ గణనీయంగా పెంచామని శాంసంగ్ తెలిపింది. ఎస్ 20, ఎస్ 20 ప్లస్‌ల్లో 64 ఎంపీ కెమెరా, ఎస్ 20 ఆల్ట్రాలో 108 ఎంపీ కెమెరా పొందుపరిచినట్లు స్పష్టం చేసింది.
మార్చి 6 నుంచి...
గెలాక్సీ ఎస్ 20 సిరీస్ ఫోన్లు మార్చి 6 నుంచి అందుబాటులోకి రానున్నాయని శాంసంగ్ తెలిపింది. వీటి ప్రాథమిక ధర 999 డాలర్లు (సుమారు రూ.72,000), రూ.1,399 డాలర్లు (సుమారు లక్ష రూపాయలు) గా ఉంటుందని స్పష్టం చేసింది.
గెలాక్సీ జెడ్ ఫ్లిప్...
శాంసంగ్ ఇదే కార్యక్రమంలో 'గెలాక్సీ జెడ్ ఫ్లిప్' అనే మడత (ఫోల్డింగ్) ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇది శాంసంగ్ మొదటి మడత ఫోను 'గెలాక్సీ ఫోల్డ్' కంటే భిన్నంగా ఉంది. ఈ కొత్త మడత ఫోన్ స్క్రీన్‌ను 2,00,000 సార్లు మడతపెట్టి, విప్పుకోవచ్చని కంపెనీ తెలిపింది. దీనిని ఫిబ్రవరి 14న 1,380 డాలర్లు (సుమారు రూ.99 వేలు) ధర విడుదల చేయనున్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి: షియోమీ బడ్జెట్ ఫోన్: రెడ్మీ 8ఏలో మరిన్ని ఫీచర్లు