దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ సంస్థ శాంసంగ్... గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్ సిరీస్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. గెలాక్సీ నోట్ 10తో పోల్చితే గెలాక్సీ 10 ప్లస్ ప్రీమియంలో అదనపు ఫీచర్లు ఉంటాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ ధరలు భారతదేశంలో రూ.69,999 నుంచి ప్రారంభమవుతాయని, ఆగస్టు 23 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటాయని శాంసంగ్ పేర్కొంది. ఇప్పటికే ఈ రెండు ఫోన్ల కోసం భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ ముందస్తు ఆర్డర్లు ప్రారంభమయ్యాయని సంస్థ తెలిపింది.
ప్రీ-బుకింగ్ ఆర్డర్ చేసిన వినియోగదారులకు, శాంసంగ్... రూ.19,999 విలువ చేసే 'గెలాక్సీ వాచ్ యాక్టివ్'ను రూ.9,999లకు అందించనుంది. దీనితో పాటు ఇతర క్యాష్ బ్యాక్ ఆఫర్లనూ అందించనుంది. రిటైల్ దుకాణాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసినా, ఆన్లైన్లో కొనుగోలు చేసినా రూ.6 వేలు క్యాష్ బ్యాక్ అందనుంది.
శాంసంగ్ గెలాక్సీ నోట్ 10, 10ప్లస్ ఫీచర్లు
* శాంసంగ్ గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్ ఒకే డిజైన్‌లో ఉంటాయి. అయితే నోట్ 10 ప్లస్ డిస్ప్లే పెద్దగా ఉంటుంది.
* నోట్ 10 --------- 6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
* నోట్ 10 ప్లస్------- 6.8 అంగుళాల క్వాడ్ హెచ్డీ+స్క్రీన్
* నోట్ 10 సిరీస్‌లోని ప్యానెల్లను డైనమిక్ అమోలేడ్ స్క్రీన్లుగా శాంసంగ్ పిలుస్తోంది. ఇవి హెచ్డీఆర్ 10+కు సపోర్ట్ చేస్తాయి.
* ఈ ఫోన్లు ఎక్సినోస్ 9825 చిప్సెట్తో, 12 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటాయి.
* గెలాక్సీ నోట్ 10 సింగిల్ వేరియంట్‌తో 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
* నోట్ 10 ప్లస్‌లో 12 జీబీ ర్యామ్ ఉంటుంది. 256 జీబీ, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న రెండు వేరియంట్లలో ఉంటుంది. దీనితో పాటు స్టోరేజ్ సామర్థ్యం పెంచుకోవడానికి వీలుగా మైక్రో ఎస్డీ కార్డు స్టాట్ కూడా ఉంటుంది. ఈ సౌలభ్యం నోట్ 10లో లేదు.
* శాంసంగ్ ఈ రెండు ఫోన్లలోనూ 3.5 ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్‌లను తీసేసింది. ఇవి గెలాక్సీ ఎస్ 10 డివైస్‌లో మాత్రమే ఉంటాయని తెలిపింది.
* కెమెరా
గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్ ఫోన్లు రెండింటిలోనూ కెమెరా ఫీచర్లు ఒకేలా ఉన్నాయి. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 12 ఎమ్పీ ప్రైమరీ సెన్సార్‌తో వేరియబుల్ ఎపర్చర్ (ఎఫ్/1.5/2.4), 16 ఎమ్పీ వైడ్ యాంగిల్ లెన్స్, 123 డిగ్రీ ఫీల్డ్- ఆఫ్ వ్యూ, 12 ఎమ్పీ టెలిఫోటో లెన్స్ కలిగి ఉన్నాయి. ఈ మూడు సెన్సార్లలోనూ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది.
అదనంగా నోట్ 10 ప్లస్‌కి టైమ్ ఆఫ్ ఫ్లైట్ సెన్సార్ ఉంది. ఇది గెలాక్సీ నోట్ 10లో లేదు. అయితే ఈ రెండు ఫోన్లు.. ఫ్రంట్ కెమెరాల్లో ఎఫ్/2.2 ఎపార్చర్, 80 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ, ఆటో ఫోకస్ సపోర్టుతో 10 ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉన్నాయి.
* శాంసంగ్ గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్ రెండూ... ఎస్-పెన్నూ సపోర్టు చేస్తాయి. ఎయిర్ గెస్చెర్స్తో పాటు పలు ఫీచర్లు కలిగి ఉన్నాయి.
* బ్యాటరీ
శాంసంగ్ మొదటిసారిగా 300 ఎమ్హెచ్ బ్యాటరీని గెలాక్సీ నోట్ 10 ప్లస్ కోసం తీసుకొచ్చింది. ఇది 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది. ఇది 15 వాట్ల వేగంతో వైర్లెస్ ఛార్జింగ్‌కూ సపోర్టు చేస్తుంది.
* నోట్ 10లో 25 వాట్ల వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 12 వాట్ల వైర్లెస్ ఛార్జింగ్ స్పీడ్‌తో కూడిన 3500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.
* నోట్ సిరీస్ ఆండ్రాయిడ్ 9 పై ఆధారిత వన్ యూఐ 1.5తో బూట్ అవుతుంది.
ఇదీ చూడండి: వైభవంగా భారతరత్న అవార్డుల ప్రదానం