ETV Bharat / business

అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు - విమానాలపై డీజీసీఏ తాజా నిబంధనలు

కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా విదేశాలకు వెళ్లే విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోమారు పొడిగించింది కేంద్రం. జులై 31 వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని పేర్కొంది.

FLIGHTS DGCI
అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు
author img

By

Published : Jun 30, 2021, 12:47 PM IST

Updated : Jun 30, 2021, 1:55 PM IST

కరోనా వైరస్‌ ముప్పు ఇంకా తొలగిపోనందున.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ నిషేధాన్ని జులై 31 వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఓ లేఖను విడుదల చేసింది.

FLIGHTS DGCI
అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

అంతర్జాతీయ విమానాలపై జులై 31 వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసిన డీజీసీఏ.. కార్గో విమానాలకు ఈ నిషేధం వర్తించదని పేర్కొంది. అయితే.. ఎంపిక చేసిన రూట్లలో అనుమతించిన విమానాల రాకపోకలను ప్రాధాన్య క్రమంలో అధికారుల అనుమతితో నడపవచ్చని డీజీసీఏ తెలిపింది.

2020 మార్చి 23 నుంచి..

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను గతేడాది మార్చి 23 నుంచి నిలిపేసింది డీజీసీఏ. అయితే, వందే భారత్‌ మిషన్‌లో భాగంగా ఎంపిక చేసిన కొన్ని దేశాలకు విమాన సర్వీసులను కొనసాగిస్తోంది.

ఇవీ చదవండి:

యూకే విమానాల రాకపై ఆ దేశం నిషేధం

అప్పటివరకు విమానాలు బంద్​!

Last Updated : Jun 30, 2021, 1:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.