ETV Bharat / business

జియో ధమాకా రీఛార్జ్.. ఒకటి కొంటే మరొకటి ఉచితం! - రిలయన్స్ జియో ఫోన్ యూజర్లు

రిలయన్స్ జియోఫోన్ వినియోగదారుల కోసం ప్రీపెయిడ్ ప్లాన్స్ ఆఫర్​ను ప్రకటించింది. ఈ మేరకు జియోఫోన్ ప్లాన్స్ ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అని తెలిపింది.

jio
జియో
author img

By

Published : Jul 31, 2021, 4:18 PM IST

రిలయన్స్ అదిరిపోయే ఆఫర్​ను ప్రకటించింది. జియో ఫోన్​ రీఛార్జ్​పై ఒకటి కొంటే మరొకటి ఉచితంగా ఇవ్వనుంది. దీనిప్రకారం 'జియోఫోన్ యూజర్లు.. ఇతర అన్ని ప్లాన్లపై రెట్టింపు ప్రయోజనాలు పొందనున్నారు' అని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అంటే ప్రతి జియోఫోన్ రీఛార్జ్ ప్లాన్​పై అంతే విలువ కలిగిన అదనపు రీఛార్జ్​ ఉచితంగా పొందొచ్చని పేర్కొంది. అయితే ఇది కేవలం ఆరు ప్రీపెయిడ్ ప్లాన్లకు మాత్రమే వర్తించనుంది.

ఏయే రీఛార్జ్​ ప్లాన్‌లు వర్తిస్తాయి?

  • రూ.39, రూ.69, రూ.75, రూ.125, రూ.155, రూ.185 విలువైన రీఛార్జ్ ప్లాన్‌లపై 'బై వన్ గెట్ వన్' ఆఫర్ వర్తిస్తుంది.
  • రూ.39 రీఛార్జ్​పై అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎంబీ డేటా, 14 రోజుల వ్యాలిడిటీ లభిస్తాయి. ఈ ప్లాన్‌లో ఉచిత ఎస్​ఎంఎస్​లు రావు. ఉచిత ఆఫర్ కింద ఈ ప్లాన్‌ను కొనుగోలు చేస్తే ప్రతి రీఛార్జ్​కు 200 ఎంబీ డేటాను పొందుతారు.
  • రూ.69 ప్రీపెయిడ్ ప్లాన్​పై.. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 0.5 జీబీ డేటా, 14 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్‌లో ఉచిత ఎస్​ఎంఎస్​లు లేవు. అయితే వన్​ జీబీ డేటా లభిస్తుంది.
  • రూ.75 ప్రీపెయిడ్ ప్లాన్​పై.. అపరిమిత వాయిస్ కాలింగ్ 3జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. 6జీబీ డేటా లభిస్తుంది.
  • రూ.125 ప్రీపెయిడ్ ప్లాన్​పై.. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 0.5 డేటాతో పాటు 28 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. ఈ ప్లాన్‌ కొనుగోలుపై రోజుకు 1జీబీ డేటా అదనంగా లభిస్తుంది.
  • రూ.155 ప్రీపెయిడ్ ప్లాన్​పై.. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 1జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌ రీఛార్జ్​పై ఒక రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది.
  • రూ.188 ప్రీపెయిడ్ ప్లాన్​పై.. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 2జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీకి అదనంగా.. 4జీబీ డేటా లభిస్తుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.