ETV Bharat / business

రిలయన్స్​ డిజిటల్​ బంపర్​ ఆఫర్లు​.. ఈనెల 16 వరకే.. - రిలయన్స్​ డిజిటల్​ ఆఫర్లు

కస్టమర్లను ఆకట్టుకునేందుకు రిలయన్స్​ డిజిటల్​ ఆఫర్లు ప్రకటించింది. ఆగస్టు 16 వరకు ఇవి అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. రిలయన్స్​ డిజిటల్​, మై జియో స్టోర్లు సహా అధికారిక వెబ్​సైట్​లో ఈ సేల్స్​ ఉంటాయని సంస్థ వెల్లడించింది.

reliance digital offers
రిలయన్స్​ డిజిటల్​ బంపర్​ ఆఫర్​.. ఈనెల 16 వరకే..
author img

By

Published : Aug 12, 2021, 8:43 PM IST

వినియోగదారుల కోసం రిలయన్స్​.. డిజిటల్​ ఇండియా సేల్స్​ పేరుతో​ అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. ఈనెల 16 వరకు ఎలక్ట్రానిక్స్ సహా పలు వస్తువుల​పై డిస్కౌంట్లను అందించనున్నట్లు తెలిపింది. టీవీలు, గృహోపకరణాలు, మొబైల్​ ఫోన్స్​, ల్యాప్​టాప్స్​ సహా ఆన్​లైన్​లో కొనుగోలు చేసే పలు వస్తువులపైన ఈ ఆఫర్లు వర్తిస్తాయి.

రిలయన్స్​ డిజిటల్​, మై జియో స్టోర్లు సహా అధికారిక వెబ్​సైట్​లో ఈ సేల్స్​ అందుబాటులో ఉంటాయని సంస్థ వెల్లడించింది. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ కార్డులు సహా ఈఎంఐ లావాదేవీలపై కస్టమర్లు 10 శాతం ఇన్స్​టాంట్​​ డిస్కౌంట్ (రూ.3000 వరకు)​ పొందవచ్చని తెలిపింది. పేటీఎం ద్వారా రూ.9,999 లేదా అంతకన్నా ఎక్కువ మొత్తంలో వస్తువులను కొనుగోలు చేస్తే రూ. 500 క్యాష్​బ్యాక్​ వస్తుందని పేర్కొంది. ఆగస్టు 31 వరకు ఈ పేటీఎం ఆఫర్​ అమలులో ఉంటుందని వెల్లడించింది. జెస్ట్ ​మనీ నుంచి రూ.10వేల కన్నా ఎక్కువ మొత్తానికి కొనుగోలు చేస్తే 10 శాతం ​ క్యాష్​బ్యాక్​ (రూ.5,000 వరకు) వస్తుందని పేర్కొంది.

వీటి మీదే ఆఫర్లు..

  • రూ.13,990 నుంచే టీవీల ధరలు ప్రారంభమవుతాయి. శాన్సుయ్​ 50 అంగుళాల అల్ట్రా హెచ్​డీ స్మార్ట్​ ఎల్​ఈడీ టీవీ రూ.29,990కే కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. 55 అంగుళాల టీసీఎల్​ అల్ట్రాహెచ్​డీ స్మార్ట్​ టీవీ కేవలం రూ.44,990కే కస్టమర్లకు లభ్యం కానుంది. ఈ టీవీ కొంటే రూ.19,990 విలువ చేసే జేబీఎల్​ సౌండ్​బార్​ ఫ్రీ.
  • వివిధ రకాల ల్యాప్​టాప్​లు రూ.16,999 నుంచే అందుబాటులో ఉంటాయి. 16జీబీ ర్యామ్​ సామర్థ్యం గల గేమింగ్ ల్యాప్​టాప్స్​ రూ.64,999 నుంచే అందుబాటులోకి రానున్నాయి. ​ లెనోవో ఎం8 32జీబీ టాబ్లెట్ కొనుగోలు ధర రూ.11,499గా సంస్థ ప్రకటించింది.
  • ఫోన్లలో.. వన్​ప్లస్​ నోర్డ్​ 2 స్మార్ట్​ ఫోన్​ రూ.29,999కే అందుబాటులో ఉంది. ఫైర్​ బోల్ట్​ అగ్ని స్మార్ట్​వాచ్​ రూ.2,699 సహా బీటీ ఇయర్​ఫోన్స్​ ధర రూ.7,999గా రిలయన్స్​ పేర్కొంది.​
  • ఎల్​జీ, శాంసంగ్​, రిఫ్రిజిరేటర్స్ ధరలు​ రూ.23,990 నుంచి ప్రారంభం అవుతాయని సంస్థ ప్రకటనలో పేర్కొంది. ఈ కొనుగోళ్లపై రూ.3,850 విలువ చేసే బహుమతులను రిలయన్స్ అందించనుంది. రూ.12,990 నుంచి వాషింగ్​మెషీన్​లు అందుబాటులో ఉంటాయి. వీటిపై రూ.1,990 విలువ చేసే గిఫ్ట్స్​ను ప్రకటించింది. వాటర్​ ప్యూరిఫయర్​ కొనుగోలు చేస్తే రూ.1,999 విలువ చేసే ఎలక్ట్రిక్​ కెటిల్​ను ఫ్రీగా ఇవ్వనుంది.

ఇదీ చదవండి : cryptocurrency news: రూ.4,537 కోట్ల క్రిప్టో కరెన్సీ హాంఫట్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.