ETV Bharat / business

చమురు సంస్థల్లో రిలయన్స్‌ వరల్డ్‌ నంబర్‌ 2 - రిలయన్స్‌ వరల్డ్‌ నంబర్‌ 2

రిలయన్స్​ మరో ఘనత సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చమురు సంస్థగా ఆవిర్భవించింది. రిలయన్స్​ ఇండస్ట్రీస్​ సహ సంస్థలైన డిజిటల్​, రిటైల్​ వ్యాపారాలు దూకుడం పనిచేస్తుండం వల్ల మార్కెట్​ విలువ గణనీయంగా పెరిగింది.

Reliance Becomes Worlds Number two Energy Company
రిలయన్స్‌ వరల్డ్‌ నంబర్‌ 2
author img

By

Published : Jul 27, 2020, 3:24 PM IST

Updated : Jul 27, 2020, 4:23 PM IST

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో అరుదైన ఘనత సాధించింది. అమెరికాకు చెందిన ఎక్సాన్‌ మొబిల్‌ను దాటేసి.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చమురు సంస్థగా ఆవిర్భవించింది. ముఖ్యంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థలైన డిజిటల్‌, రిటైల్‌ వ్యాపారాలు దూకుడుగా ఉన్నందున ఈ కంపెనీ మార్కెట్‌ విలువ గణనీయంగా పెరిగింది. గత శుక్రవారమే కంపెనీ మార్కెట్‌ విలువ 189 బిలియన్‌ డాలర్లను తాకడం వల్ల ఎక్సాన్‌ మొబిల్‌ను దాటేసింది. ఈ రెండింటి మధ్య బిలియన్‌ డాలర్ల తేడా ఉంది. ఓ పక్క రిలయన్స్‌ షేరు పెరుగుతుండగా.. మరోపక్క ఎక్సాన్‌ షేరు పడిపోతోంది. ఈ ఏడాది 39శాతం విలువ కోల్పోయింది. చమురు డిమాండ్‌ తగ్గుదల రోజుకు 30 మిలియన్‌ బ్యారెళ్ల వరకు ఉంది. ఇది చాలా పెద్ద మొత్తం. చమురు డిమాండ్‌ తగ్గడమే ఎక్సాన్‌పై ప్రభావం చూపింది. మరోపక్క రిలయన్స్‌ వ్యాపార వైవిధ్యం కారణంగా పెట్రోలియం విభాగంలో లాభాలు తగ్గినా.. డిజిటల్‌, రిటైల్‌ విభాగాలు కాపాడాయి. వాస్తవానికి మార్చి 31 నాటికి రిలయన్స్‌ ఆదాయంలో 80శాతం పెట్రోలియం వ్యాపారం నుంచే వచ్చింది.

కాంబినేషన్స్‌ అదుర్స్‌..

రిలయన్స్‌ తన అనుబంధ వ్యాపారాలను అద్భుతంగా వినియోగించుకుంటోంది. రిలయన్స్‌కు సంబంధించిన ఉత్పత్తులను విక్రయించడానికి ఇది మంచి వేదికగా ఉపయోగపడింది. జియో వచ్చిన కొత్తల్లో రిలయన్స్‌ డిజిటల్‌ ఊతకర్రలాగా పనిచేసింది. ఇలాంటివి ఒక పక్కా ప్రణాళిక లేకుండా అప్పటికప్పుడు అనుకొని చేయడం సాధ్యం కాదు. ఏది ముందు.. ఏది తర్వాత మార్కెట్లోకి రావాలనే అంశాలపై పట్టు ఉండాలి. రిలయన్స్‌ వ్యాపార శైలిలో ఇది కచ్చితంగా కనిపిస్తుంది. భారత్‌ రిటైల్‌ రంగంలో పట్టు బిగించాక.. టెలికాం రంగంలోకి వచ్చింది. డేటా మార్కెట్‌లో తిరుగు లేని ఆధిపత్యం సంపాదించాక ఈ-కామర్స్‌ రంగంలోకి అడుగుపెడుతోంది. దీంతోపాటు కస్టమర్లు ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేసి ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసే విధంగా వ్యాపార వ్యూహాన్ని సిద్ధం చేసింది. రిలయన్స్‌ రిటైల్‌తోపాటు స్థానిక విక్రేతలను కూడా భాగస్వాములుగా చేయనుండటం వల్ల మార్కెట్లోకి బలంగా చొచ్చుకుపోయే అవకాశం దీనికి లభించింది. కొన్నేళ్ల క్రితమే ప్రధాన వ్యాపారమైన రిఫైనింగ్‌, పెట్రో కెమికల్స్‌కు అనుబంధంగా రిటైల్‌ పెట్రోల్‌ పంపులను విస్తరించాలని నిర్ణయించింది. అప్పట్లో బ్రిటిష్‌ పెట్రోలియంతో జట్టుకట్టింది.

Reliance Becomes Worlds Number two Energy Company
ముకేశ్​ అంబానీ

కొనుగోళ్లకు వెనుకాడని వైనం..

రిలయన్స్‌ డిజిటల్‌, మీడియా మార్కెట్‌లో బలపడటం కోసం భారీగా కంపెనీల కొనుగోళ్లకు తెరతీసింది. ఈ క్రమంలో నెట్‌వర్క్‌ 18, కలర్స్‌, వైకామ్‌, మనీకంట్రోల్‌ వంటి ఛానళ్లను సొంతం చేసుకొంది. దీంతోపాటు బాలాజీ టెలిఫిల్మ్‌ వంటి హిందీ దిగ్గజ నిర్మాణ సంస్థను ఒడిసిపట్టింది. హాత్‌వే కేబుల్స్‌, డెన్‌ నెట్‌వర్క్స్‌, డేటాకామ్‌ వంటి కేబుల్‌ సంస్థలు రిలయన్స్‌ గూటికి చేరాయి. ఇవి దేశంలోని మారుమూల ప్రాంతానికి రిలయన్స్‌ను చేర్చాయి. రిలయన్స్‌ ఉత్పత్తులను మార్కెటింగ్‌కు ఇవన్నీ మంచి వేదికలుగా నిలుస్తాయి.

అసలు ఈ వ్యాపార వైవిధ్యం దేనికి..?

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆదాయాల్లో సింహభాగం ఇప్పటికీ పెట్రో కెమికల్‌, చమురు శుద్ధి వ్యాపారం నుంచే లభిస్తోంది. కానీ, చమురు మార్కెట్లలో, వినియోగంలో పరిస్థితులు వేగంగా మారుతుండటం వల్ల కంపెనీ ఆదాయ మార్గాలు దెబ్బతినకుండా వివిధ రకాల వ్యాపారాలపై కూడా దృష్టిపెట్టింది. 2020 మార్చి వరకు పెట్రోలియం రంగం బాగానే ఉన్నందున ఈ విభాగం హవా కొనసాగింది. కానీ, కరోనా ప్రభావంతో దీనికి డిమాండ్‌ తగ్గడం వల్ల రీటైల్‌, టెలికామ్‌ రంగాలు శక్తిమంతంగా ఆవిర్భవించాయి.

కన్జ్యూమర్​ బిజినెస్​ నుంచే..

2019 జూన్‌ త్రైమాసికంలో కంపెనీ స్థూల ఆదాయంలో 32శాతం కన్జ్యూమర్‌ బిజినెస్‌ నుంచే లభించింది. కొన్నేళ్ల క్రితం ఈ మొత్తం 10శాతం లోపు మాత్రమే ఉండేది. అంటే రిలయన్స్‌ ఆదాయం కోసం కేవలం చమురు వ్యాపారంపై మాత్రమే ఆధారపడాల్సిన పరిస్థితి నుంచి బయటపడిందని అర్థం. ప్రపంచ వ్యాప్తంగా కాలుష్య నిర్మూలన కోసం వాహనాల్లో చమురు వినియోగాన్ని తగ్గించి విద్యుత్‌ వినియోగంపై దృష్టిపెట్టారు. ఇది పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చే సరికి రిలయన్స్‌కు డేటా, రిటైల్‌ వంటి ఇతర రంగాల నుంచి ప్రధాన ఆదాయం లభించడం మొదలవుతుంది. ఇటీవల జూన్‌ త్రైమాసికంలో హైడ్రోకార్బన్ల వ్యాపారం కొంత ఒత్తిడికి లోనైనా.. రిటైల్‌, ఇతర వ్యాపారాలు దానిని ఆదుకొన్నాయి.

అదే కీలక మలుపు..

అలాగని ప్రధాన ఆదాయ వనరైన హైడ్రోకార్బన్ల వ్యాపారాన్ని రిలయన్స్‌ ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. తన చమురు, గ్యాస్‌ శుద్ధి కర్మాగారాలను అప్‌గ్రేడ్‌ చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఫలితంగా ఇప్పుడు రిలయన్స్‌ వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద శుద్ధికర్మాగారాలు ఉన్నాయి. సౌదీ ఆరాం కో వంటి దిగ్గజానికి 20శాతం వాటాలను విక్రయించి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఇవ్వడం వల్ల ఈ రంగంలో రిలయన్స్‌ తిరుగులేని శక్తిగా నిలిచింది. దీనితోపాటు జియో ప్లాట్‌ఫామ్స్‌పై మరో 13 డీల్స్‌ చేసుకొని రుణరహిత సంస్థగా ఆవిర్భవించింది. వాటా మూలధనంపైనే అధికంగా వ్యాపారం చేయాలని.. అప్పులపై ఆధారపడకూడదనే రిలయన్స్‌ సిద్ధాంతానికి ఈ చర్య ఊతం ఇస్తుంది.

గత కొన్నేళ్లుగా వ్యాపార విస్తరణకు రిలయన్స్‌ దాదాపు రూ.5.4లక్షల కోట్లను వెచ్చించింది. ఒక్క టెలికాం రంగంలోనే రూ.3.5లక్షల కోట్లను వెచ్చించింది. భవిష్యత్తులో చౌకగా 5జీ విస్తరణపై దృష్టిపెట్టడం వల్ల రిలయన్స్‌ ఎదుగుదల ఆకాశమే హద్దుగా ఉంటుందని వాటాదారులు బలంగా నమ్మడం వల్ల షేర్‌ మార్కెట్లో ర్యాలీ కొనసాగుతోంది. ఇది విదేశాల్లో కూడా మార్కెట్‌ను సాధిస్తే ఇక 5జీలో రిలయన్స్‌ కత్తికి ఎదురుండకపోవచ్చు. ముఖేశ్‌ ముందుచూపుతో రిలయన్స్‌ భారత కార్పొరేట్‌ రంగంలో దార్శనికతకు నిలువుటద్దంగా నిలుస్తోంది.

ఇదీ చదవండి: జుకర్​బర్గను దాటి ముకేశ్ 4వ స్థానానికి చేరేనా?

Last Updated : Jul 27, 2020, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.