ETV Bharat / business

'వారి సమాచారం కోసం భారత్ భారీగా​  అభ్యర్థనలు'

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్.. 2020 ద్వితీయార్థ పారదర్శకత నివేదికను విడుదల చేసింది. ఈ కాలానికి సంబంధించి భారత ప్రభుత్వం నుంచి 40,300 అభ్యర్థనలను వచ్చినట్లు వెల్లడించింది. 2020 జనవరి-జూన్ మధ్యకాలంలో వచ్చిన అభ్యర్థనలు(35,560) కన్నా ఇది 13.3శాతం ఎక్కువని తెలిపింది.

Facebook
ఫేస్​బుక్
author img

By

Published : May 20, 2021, 4:48 PM IST

2020 ద్వితీయార్థంలో.. వినియోగదారుల సమాచారం(యూజర్ డేటా) తెలపాల్సిందిగా భారత ప్రభుత్వం నుంచి 40,300 అభ్యర్థనలను అందుకున్నట్లు సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్ తన పారదర్శకత నివేదికలో వెల్లడించింది. ఐటీ చట్టం-2000 సెక్షన్ 69ఏ ఉల్లంఘణ కింద.. 878 పోస్టులను తొలగించినట్లు పేర్కొన్న ఎఫ్​బీ.. జాతీయ భద్రత దృష్ట్యా.. సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ చర్యను చేపట్టినట్లు వివరించింది.

నివేదికలోని అంశాలు..

  • 2020 ద్వితీయార్థంలో వచ్చిన అభ్యర్థనలు 40,300.. వీటిలో 37,865 చట్టపరమైన ప్రక్రియకు సంబంధించినవి కాగా.. 2,435 అత్యవసర అభ్యర్థనలు.
  • జనవరి-జూన్ మధ్యకాలంలో వచ్చిన అభ్యర్థనలు(35,560) కన్నా ఇది 13.3శాతం ఎక్కువ.
  • జూలై-డిసెంబర్ కాలంలో వచ్చిన అత్యధిక అభ్యర్ధనలు చేసిన దేశం అమెరికా( 61,262) తర్వాత.. భారత్ రెండో స్థానంలో ఉంది.
  • ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రభుత్వాల నుంచి వచ్చిన అభ్యర్థనలు 10శాతం (191,013) మేర పెరిగాయి.
  • భారత ప్రభుత్వం నుంచి 62,754 అకౌంట్లకు సంబంధించి అభ్యర్థనలు రాగా.. 52శాతం యూజర్ల డేటాను ఎఫ్​బీ అందించింది.

"ప్రభుత్వాల నుంచి వచ్చే అభ్యర్థనలకు సంబంధిత చట్టాలు, సర్వీసు నిబంధనలకు అనుగుణంగానే ఫేస్​బుక్ స్పందిస్తుంది. మేము స్వీకరించే ప్రతి అభ్యర్థన చట్టపరమైనదా? కాదా? అని సమీక్షిస్తాం. ఒక పోస్టుకు సంబంధించి అత్యధికంగా, అస్పష్టంగా వచ్చే అభ్యర్థనలు ఎక్కువగా తిరస్కరణకు గురవుతాయి. అలాగే.. ఆయా దేశాల్లోని చట్టాలను ఫేస్​బుక్ గౌరవిస్తుంది. అయితే.. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వాల నుంచి వచ్చే డిమాండ్లను గట్టిగా వ్యతిరేకిస్తుంది."

-పారదర్శక నివేదికలో ఫేస్​బుక్

ఇవీ చదవండి: మోదీ వ్యతిరేక పోస్ట్​లను బ్లాక్​ చేసిన ఫేస్​బుక్​!

కరోనా టీకా సమాచారానికి ఫేస్​బుక్​ కొత్త టూల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.