ETV Bharat / business

రియల్టీ, నిర్మాణ రంగాల నియామకాల్లో వృద్ధి! - రియల్ ఎస్టేట్ ఉద్యోగాలు

2020లో విధించి లాక్​డౌన్ వల్ల భారీగా కుదేలైన రంగాల్లో రియల్టీ, నిర్మాణ రంగాలు కూడా ప్రధానంగా ఉన్నాయి. ఈ కారణంగా గత ఏడాది ఆయా రంగాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. అయితే ఆంక్షల సడలింపు తర్వాత ఇప్పుడు ఆ రెండు రంగాల్లో ఉపాధి అవకాశాలు, నియామకాలు పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఆ నివేదికలోని మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

real estate real estate
రియల్ఎస్టేట్
author img

By

Published : Apr 22, 2021, 6:08 PM IST

కరోనా నేపథ్యంలో గత ఏడాది విధించిన లాక్​డౌన్​ వల్ల రియల్టీ, నిర్మాణ రంగాల్లో ఉపాధి అవకాశాలు భారీగా తగ్గాయి. అయితే ఆంక్షలు సడలించడం వల్ల ఈ పరిస్థితి మారుతున్నట్లు తెలుస్తోంది.

భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఈ రంగాలు కోలుకుంటున్నట్లు ఎన్​ఎస్​ఓ కూడా ఇటీవల విడుదల చేసిన జీడీపీ గణాంకాల్లో పేర్కొంది. ఈ లెక్కలు రియల్టీ, నిర్మాణ రంగాల్లో ఉపాధిపై ఆసక్తితో పాటు.. నియామకాలు కూడా పెంచినట్లు ప్రముఖ జాబ్​ పోర్టల్ ఇండీడ్ నివేదిక వెల్లడించింది.

ఇండీడ్​ డేటా ప్రకారం..

రియల్టీ రంగంలో ఉద్యోగాలపై ఆసక్తి గత ఏడాది మార్చితో పోలిస్తే.. 2021 మార్చి నాటికి 22 శాతం పెరిగింది. నియామకాలు కూడా 3 శాతం పుంజుకున్నాయి.

నిర్మాణ రంగ ఉద్యోగాలపై కూడా 18 శాతం ఆసక్తి పెరగ్గా.. నియామకాలు స్వల్పంగా 0.3 శాతం పుంజుకున్నాయి.

ఈ రెండు రంగాల్లో నియామకాలు పెరగటం మంచి సంకేతంగా భావించొచ్చు. ఎందుకంటే ఈ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరగటం రికవరీకి చాలా కీలకమని నిపుణులు అంటున్నారు.

ఆంక్షల సడలింపుతో గత ఏడాది జూన్​లో ఈ రెండు రంగాలు భారీగా రికవరీ అయ్యాయి. 2020 ద్వితీయార్ధం నుంచి రికవరీ స్థిరంగా కొనసాగుతోంది.

నిర్మాణ రంగంలో.. సైట్​ ఇంజనీర్​, కన్​స్ట్రక్షన్ వర్కర్​, ప్లానింగ్ ఇంజనీర్​, సివిల్ సూపర్వైజర్​, కార్పేంటర్లకు డిమాండ్​ ఎక్కువగా ఉంది.

ఇవీ చదవండి: '19 రోజుల్లో రూ.5,649 కోట్ల పన్ను రీఫండ్​'

ఐటీ ఉద్యోగులకు టీకా- ఇంకొన్నాళ్లు ఇంటి నుంచే పని!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.