ETV Bharat / business

ఆరోగ్య మౌలిక సదుపాయాల్లో హైదరాబాద్@5 - దేశంలో వెయ్యిమందికి అందుబాటులో ఉన్న ఆసుపత్రుల సంఖ్య

కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఆరోగ్య మౌలిక సదుపాయాల పరిస్థితిపై ఓ నివేదిక విడుదలైంది. దీని ప్రకారం ప్రతి 1000 మంది జనాభాకు 1.4 ఆసుపత్రి పడకలే అందుబాటులో ఉన్నాయని స్పష్టం అవుతోంది. ఈ జాబితాలో 3.5 పడకల లభ్యతతో పుణె మొదటి స్థానంలో నిలవగా.. దిల్లీ చివరి స్థానంలో ఉంది. ఆస్పత్రుల్లో గాలి, నీటి నాణ్యత, అందుబాటులో ఉన్న పడకల సంఖ్య సహా.. ఇతర అంశాల ఆధారంగా ఈ నివేదిక రూపొందింది.

health infra
ఆరోగ్య మౌలిక సదుపాయాలు
author img

By

Published : May 12, 2021, 5:00 PM IST

ఆరోగ్య మౌలిక సదుపాయాల విషయంలో పుణె మొదటి స్థానంలో నిలిచింది. టాప్ 8 నగరాల జాబితాలో దిల్లీ చివరి స్థానంలో నిలిచినట్లు ఓ నివేదిక స్పష్టం చేసింది. ఆస్పత్రుల్లో గాలి, నీటి నాణ్యత, అందుబాటులో ఉన్న పడకల సంఖ్య సహా.. పారిశుద్ధ్య వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని రూపొందిన ఈ నివేదికను.. అమెరికా, ఆస్ట్రేలియా సంయుక్త సంస్థ 'ఆర్​ఈఏ'.. 'స్టేట్ ఆఫ్ హెల్త్‌కేర్ ఇన్ ఇండియా' పేరుతో విడుదల చేసింది.

భారతదేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలైన.. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ-ఎన్‌సీఆర్, హైదరాబాద్, కోల్‌కతా, ముంబయి, పుణెలోని ఆరోగ్య మౌలిక సదుపాయాల వివరాలు ఈ నివేదికలో ఉన్నాయి. 1,000 మంది జనాభాకు అందుబాటులో ఉన్న పడకల సంఖ్య, గాలి, తాగునీటి లభ్యత, నాణ్యత, పారిశుద్ధ్యం, జీవనోపాధి సూచికల ఆధారంగా రూపొందించగా.. 40 శాతం మార్కులు ఆసుపత్రి పడకలకే కేటాయించారు.

నివేదికలోని మరిన్ని వివరాలు..

  • ఆరోగ్య మౌలిక సదుపాయాల్లో భారతదేశంలోనే అత్యంత సన్నద్ధమైన నగరంగా పుణె నిలిచింది. ఇక్కడ ప్రతి 1,000 మందికి 3.5 ఆసుపత్రి పడకలు అందుబాటులో ఉన్నాయి. జాతీయ సగటుతో పోల్చితే ఇది చాలా ఎక్కువ. జీవన ప్రమాణాలు, తాగునీటి నాణ్యత, వంటి ఇతర అంశాల్లోనూ పుణె గణనీయంగా ప్రగతి సాధించింది.
  • 1,000 మంది జనాభాకు 3.2 ఆసుపత్రి పడకలతో.. అహ్మదాబాద్ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉంది.
  • అధిక సంఖ్యలో ఆసుపత్రి పడకలు, జీవన ప్రమాణాల్లో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ బెంగళూరు మూడో స్థానంలో నిలిచింది. గాలి నాణ్యత, నీటి నాణ్యత, లభ్యత, మున్సిపల్ కార్పొరేషన్ పనితీరు సూచికల ర్యాకింగ్​లో వెనుకపడటమే ఇందుకు కారణం.
  • ఇక మరో ప్రధాన నగరం హైదరాబాద్ ఐదో స్థానంలో.. చెన్నై, కోల్‌కతా వరుసగా ఆరు, ఏడో స్థానాల్లో నిలిచాయి.
  • దేశ రాజధాని దిల్లీ ఈ జాబితాలో అత్యల్ప స్థానంలో నిలిచింది. ప్రధానంగా ఈ ప్రాంతంలో గాలి నాణ్యత, నీటి లభ్యత పారిశుధ్యం, మున్సిపాలిటీ సంస్థల పనితీరు తీసికట్టుగా ఉందని నివేదిక తెలిపింది.
  • మొత్తంగా దేశంలో 2.4 మిలియన్ పడకల కొరత (పబ్లిక్, ప్రైవేట్) ఉన్నట్లు నివేదిక ఆక్షేపించింది.

1.4పడకలే..

మొత్తంగా ప్రజారోగ్యానికి సంబంధించి.. దేశంలో ప్రతి 1,000 మందికి కేవలం 1.4 పడకలు(ప్రభుత్వ, ప్రైవేట్) అందుబాటులో ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఇక దేశంలో ప్రతి వెయ్యి మంది జనాభాకు కేవలం 0.86 వైద్యులే అందుబాటులో ఉండగా.. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో 2-4గా ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్​.. ఆరోగ్య సంరక్షణపై చేసే ఖర్చును గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

ఇవీ చదవండి: 'నిధుల కేటాయింపుల్లో ఆరోగ్య రంగంపై నిర్లక్ష్యం'

'కరోనా సెకండ్​ వేవ్​ తగ్గుముఖం!'

ప్రజారోగ్యానికి సహకార వైద్యసేవల దన్ను

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.