ఎల్టీసీ క్యాష్ ఓచర్ పథకంపై మరింత స్పష్టత ఇచ్చింది కేంద్ర ఆర్థిక శాఖ. 2020 అక్టోబరు 12 నుంచి 2021 మార్చి 31 మధ్య కొత్త బీమా పాలసీల కోసం ఉద్యోగులు చెల్లించిన ప్రీమియంలకు ఎల్టీసీ పథకం కింద రియింబర్స్మెంట్ పొందవచ్చని ఆర్థిక శాఖ పరిధిలోని వ్యయాల విభాగం వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఉన్న ఇన్సూరెన్స్ పాలసీలకు ఈ పథకం వర్తించదని స్పష్టం చేసింది.
అంతేకాకుండా, ఉద్యోగులు తాము కొనుగోలు చేసిన వస్తువులకు ఒరిజినల్ బిల్లులకు బదులు నకలు బిల్లులు(ఫొటోకాపీలు) సమర్పించి ఎల్టీసీ పథకం కింద మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని తెలిపింది. ఈ ప్రయోజనాలు పొందాలనుకునే ఉద్యోగులు వచ్చే ఏడాది మార్చి 31లోగా తమ బిల్లులన్నింటినీ సమర్పించాలని సూచించింది.
కరోనా నేపథ్యంలో వినియోగం పెంచేందుకు అక్టోబరు 12న ప్రకటించిన ఎల్టీసీ పథకంపై ఉద్యోగుల్లో తలెత్తుతున్న పలు సందేహాలను విడతల వారీగా నివృతి చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.
ఇదీ చూడండి: ఎల్టీసీ క్యాష్ ఓచర్పై కేంద్రం మరింత స్పష్టత