సమోసా.. ఎన్నో ఏళ్లుగా భారతీయులు తీసుకునే చిరుతిళ్లలో దీనికి మంచి గుర్తింపు ఉంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఇది దొరుకుతుంది. ఇంట్లో చేసుకునే వేడుకల నుంచి బడా బడా పార్టీల్లో కూడా సమోసా తప్పని సరి. అయితే ఈ సమోసా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సమోసా ఆకారం లేదా రుచి గురించో అయితే పెద్దగా చర్చ జరిగేది కాదేమో.
ఇంతకీ ఏమైందంటే..
నితిన్ మిశ్రా అనే ఓ ట్విట్టర్ యూజర్.. తన వాల్‌పై సమోసా ఫోటోలను పోస్ట్ చేశాడు. ఆ సమోసాలకు సీరియల్ నంబర్లు ఉండటం చూసి ఆశ్చర్యపోయి ఈ పోస్ట్ చేశాడు.
'నేను ఆర్డర్ చేసిన సమోసాలు సీరియల్ నంబర్‌తో వచ్చాయి. టెక్ (టెక్నాలజీ) నా సమోసాకు దూరంగా ఉంటావా ప్లీజ్' అంటూ రాసుకొచ్చాడు ఆ యూజర్.
-
Samosas I ordered had serial numbers 🙄 Can tech pls stay away from my halwai. pic.twitter.com/DKo1duIiC9
— Nitin Misra (@nitinmisra) September 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Samosas I ordered had serial numbers 🙄 Can tech pls stay away from my halwai. pic.twitter.com/DKo1duIiC9
— Nitin Misra (@nitinmisra) September 1, 2021Samosas I ordered had serial numbers 🙄 Can tech pls stay away from my halwai. pic.twitter.com/DKo1duIiC9
— Nitin Misra (@nitinmisra) September 1, 2021
దీనితో ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనికి నెటిజన్లు తమ శైలిలో స్పందిస్తున్నారు. 'ఇది నిజంగానే అందోళన చెందాల్సిన విషయం. సమోసాపై సీరియల్ నంబర్ అయిపోయింది. ఇప్పుడు రసగుళ్లాపై క్యూఆర్ కోడ్ ముద్రిస్తారా?' అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు ఓ యూజర్.
సమోసాపై ఫ్యాన్సీ నంబర్ ఉంటే.. అధిక ధరకు విక్రయిస్తారా? అంటూ మరో యూజర్ స్పందించాడు. సమోసాలను ట్రేస్ చేసేందుకు కోడ్ ముద్రించి ఉంటారని మరో యూజర్ ఫన్నీగా చెప్పుకొచ్చాడు.
ఇంతకీ సమోసాలపై కోడ్ ఎందుకు?
అయితే సమోసాపై కోడ్ ముంద్రించడం వెనక కారణం లేకపోలేదు. సమోసా పార్టీ అనే ఓ స్టార్టప్ వీటిని ముద్రించింది. వివిధ వెరైటీల మధ్య తేడాలను గుర్తించేందుకు వీలుగా ఈ కోడ్లను ముద్రించినట్లు ఆ స్టార్టప్ చెప్పుకొచ్చింది.
ఇదీ చూడండి : '2030 నాటికి 100 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి'