ETV Bharat / business

Phonepe News: యూజర్లకు ఫోన్​పే షాక్​- వాటిపై ఛార్జీలు - phonepe latest news

యూపీఐ ఆధారిత లావాదేవీలపై ప్రాసెసింగ్​ రుసుములు (Phonepe UPI Transaction Charges) విధించడం ప్రారంభించింది ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్​పే (Phonepe News). రూ.50 కంటే అధిక విలువ కలిగిన మొబైల్‌ రీఛార్జీలపై లావాదేవీకి రూ.1-2 చొప్పున వసూలు చేయనుంది.

PhonePe
phonepe news
author img

By

Published : Oct 23, 2021, 5:11 AM IST

వాల్‌మార్ట్‌ గ్రూప్‌నకు చెందిన డిజిటల్‌ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే (Phonepe News), ఫోన్‌ రీఛార్జులపై ప్రాసెసింగ్‌ రుసుమును వసూలు చేయడం ప్రారంభించింది. రూ.50 కంటే అధిక విలువ కలిగిన మొబైల్‌ రీఛార్జీలపై లావాదేవీకి రూ.1-2 చొప్పున వసూలు చేయనుంది. రీఛార్జి లావాదేవీ యూపీఐ ద్వారా చేసినా, ప్రాసెసింగ్‌ రుసుము భారం పడుతుంది.

యూపీఐ ఆధారిత లావాదేవీలపై ఛార్జీలు (Phonepe UPI Transaction Charges) విధించడం ప్రారంభించిన మొదటి డిజిటల్‌ చెల్లింపుల సంస్థగా ఫోన్‌పే నిలవనుంది. పోటీ సంస్థలు ఈ లావాదేవీలపై ఛార్జి వసూలు చేయడం లేదు. ఇప్పటివరకు క్రెడిట్‌ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై ఫోన్‌పేతో పాటు ఇతర సంస్థలు కూడా ప్రాసెసింగ్‌ ఫీజులు (Phonepe Transaction Charges) వసూలు చేస్తున్నాయి. రూ.50 లోపు ఫోన్‌ రీఛార్జీలపై రుసుములు ఉండవని, రూ.50-100 రీఛార్జీలపై రూ.1, రూ.100 దాటితే రూ.2ను ప్రయోగాత్మకంగా వసూలు చేయనున్నట్లు ఫోన్‌పే అధికార ప్రతినిధి వెల్లడించారు.

  • థర్డ్‌ పార్టీ యాప్‌లలో అధిక లావాదేవీలను ఫోన్‌పే నిర్వహిస్తోంది. సెప్టెంబరులో 165 కోట్ల యూపీఐ లావాదేవీలను ఫోన్‌పే నిర్వహించి, ఈ విభాగంలో 40 శాతం వాటా పొందింది.

ఇవీ చూడండి:

యూపీఐ రాకతో డిజిటల్ పేమెంట్స్ విప్లవం!

ఫాస్టాగ్​​పై ఐసీఐసీఐ బ్యాంక్​, ఫోన్​పే ఒప్పందం

'గూగుల్‌ పే'ను దాటేసిన ఫోన్‌ పే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.