ETV Bharat / business

బిలియన్​ డాలర్ల సమీకరణే లక్ష్యంగా ఐపీఓకు ఫార్మ్​ఈజీ!

మార్కెట్లో ఐపీఓల జోరు నడుస్తోంది. ఫార్మ్‌ఈజీ మాతృసంస్థ 'ఏపీఐ హోల్డింగ్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌' పబ్లిక్‌ ఇష్యూకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సుమారుగా 1 బిలియన్​ డాలర్లు సమీకరణే లక్ష్యంగా ఐపీఓకు రానున్నట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు.

Pharmeasy To Raise $1 Bn Via IPO
ఐపీఓకు ఫార్మ్​ఈజీ
author img

By

Published : Aug 11, 2021, 2:31 PM IST

ప్రముఖ ఆన్‌లైన్‌ ఔషధ డెలివరీ కంపెనీ ఫార్మ్‌ఈజీ మాతృసంస్థ 'ఏపీఐ హోల్డింగ్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌' పబ్లిక్‌ ఇష్యూకి వచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. దాదాపు 1 బిలియన్ డాలర్లు సమీకరించేందుకు ఆలోచనలు చేస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ కంపెనీ ప్రతినిధి తెలిపారు. మార్చి 2022 నాటికి ఐపీఓకి రావాలని సలహాదారులతో కంపెనీ యాజమాన్యం సమాలోచనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు జరుగుతున్న చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నట్లు తెలిపారు.

ఫార్మ్‌ఈజీ ఇప్పటి వరకు ఔషధాలు, డయాగ్నోస్టిక్‌ కిట్లు, ఇతర ఆరోగ్య సంరక్షణా కిట్లు కలుపుకొని మొత్తం 15 మిలియన్ల ఆర్డర్లను దాదాపు 5 మిలియన్ల కుటుంబాలకు అందజేసినట్లు సంస్థ వెబ్‌సైట్‌లో పేర్కొంది. మొత్తం 1000 పట్టణాలకు సేవలు విస్తరించాయి. థైరోకేర్‌ టెక్నాలజీస్‌లో 611 మిలియన్‌ డాలర్లతో మెజారిటీ వాటాను ఇటీవలే కొనుగోలు చేసింది.

ఏపీఐ హోల్డింగ్స్‌ జూన్‌లో 420 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు సమీకరించింది. దీంతో సంస్థ విలువ 4.1 బిలియన్‌ డాలర్లకు చేరింది.

ఇదీ చూడండి: ఈ వారంలో మరో 4 ఐపీఓలు- ఏంటంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.