రాజధానిలో పెట్రో వాత..
దేశరాజధాని దిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు భారీగా పెరిగాయి. చమురుపై 27 శాతంగా ఉన్న వ్యాట్‌ను 30 శాతానికి పెంచుతూ దిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఒక్క సారిగా ధరలు భారీగా పెరిగాయి.
దిల్లీ సర్కార్ నిర్ణయంతో లీటర్ పెట్రోల్ ధర రూ.1.67 పెరిగి ప్రస్తుతం రూ.71.26గాకి చేరింది. లీటర్ డీజిల్ ధర ఏకంగా రూ.7.10 పెరిగింది. ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర రూ.69.59కి వద్దకు చేరింది.
దేశవ్యాప్తంగా అసోం, గోవా, హరియాణా, రాజస్థాన్, పుదుచ్చేరిలో మాత్రమే నేడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లాక్‌డౌన్‌తో గత కొన్ని రోజులుగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్తబ్దుగా కొనసాగతున్నాయి.