దేశీయ ప్రముఖ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటీఎం తన ప్లాట్‌ఫామ్‌లో ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్స్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. పేటీఎం ఇప్పుడు 2 నిమిషాల్లో వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. ఇప్పటికే పేటీఎం సేవలను పొందుతున్న వినియోగదారులు 2 నిమిషాల్లో వారి రుణ అర్హతను బట్టి రుణాలు పొందటానికి అనుమతిస్తోంది. లోన్‌ను 18-36 నెలల్లో వాయిదా పద్ధతిలో తీర్చవచ్చు.
వాయిదాలను బట్టి ఈఎంఐను నిర్ణయిస్తారు. రుణాలను ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకులు ప్రాసెస్ చేసి పంపిణీ చేస్తాయి. ఈ చర్య 'క్రెడిట్ టు న్యూ' కస్టమర్లను ఆర్ధిక మార్కెట్ పరిధిలోకి తీసుకువస్తుంది. సంప్రదాయ బ్యాంకింగ్ సంస్థలకు యోగ్యత లేని చిన్న నగరాలు, పట్టణాల నుంచి వచ్చిన వ్యక్తులకు కూడా ఆర్థిక సహాయం అందుతుంది.
ఇదీ ప్రక్రియ..
రుణ ధరఖాస్తు, పేపర్ డాక్యుమెంటేషన్ అవసరం లేకుండా రుణ పంపిణీ కోసం మొత్తం ప్రక్రియను పేటీఎం డిజిటలైజ్ చేసింది. ఈ కార్యక్రమం అత్యాధునిక పేటీఎం టెక్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ఇది బ్యాంకులు మరియు ఎన్‌బీఎఫ్‌సీలకు రుణాలను 2 నిమిషాల కన్నా తక్కువ వ్యవధిలో ప్రాసెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. అర్హత కలిగిన వినియోగదారులు ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం కింద 'పర్సనల్ లోన్' టాబ్ ద్వారా ఈ సేవను పొందొచ్చు. మరియు వారి పేటీఎం యాప్ నుంచే వారి రుణ ఖాతాను నిర్వహించవచ్చు. ఈ రుణ సేవను సులభతరం చేయడానికి పేటీఎం వివిధ ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకులతో ఒప్పందం దుర్చుకుంది. ఈ పేటీఎం ప్లాట్‌ఫాం నుంచి ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దాదాపు 10 లక్షల మందికి రుణాలు ఇవ్వాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
రిటైల్ చెల్లింపులు..
ఇటీవల సంస్థ తన పేటిఎం పోస్ట్‌పెయిడ్ సేవలను కిరాణా, ప్రసిద్ధ రిటైల్ గమ్యస్థానాల్లో చెల్లింపులు వంటి పెద్ద సేవలకు కూడా విస్తరించింది. పేటీఎం మాల్‌లో షాపింగ్ చేయడం మరియు డోమినోస్, టాటా స్కై, పెప్పర్‌ఫ్రై, హంగర్‌బాక్స్, పతంజలి, స్పెన్సర్ వంటి ఇంటర్నెట్ యాప్‌లలో ఆన్‌లైన్ చెల్లింపులకు కూడా ఈ సేవలను విస్తరించారు.
ఇదీ చదవండి: 'ప్రభుత్వం ఈసారి ఆర్బీఐ నుంచి అప్పు చేయాలి'