ETV Bharat / business

గేరు మారిన వాహన రంగం- పెరిగిన విక్రయాలు

దేశీయంగా వాహన విక్రయాలు ఆగస్టులో మళ్లీ జోరందుకున్నాయి. 2019 ఆగస్టుతో పోలిస్తే.. గత నెల ప్యాసింజర్​ వాహనాల విక్రయాలు 14.6 శాతం పెరిగినట్లు సియామ్​ గణాంకాల చెబుతున్నాయి.

author img

By

Published : Sep 11, 2020, 12:21 PM IST

SIAM AUGUST AUTO SALES REPORT
ఆగస్టులో భారీగా పెరిగిన ప్యాసింజర్ వాహనాలు

కరోనా సంక్షోభం నుంచి దేశీయ వాహన రంగం నెమ్మదిగా తేరుకుంటోంది. ప్యాసింజర్ వాహనాల విక్రయాలు ఆగస్టులో 14.16శాతం పెరిగాయి. భారత వాహన తయారీదార్ల సంఘం(సియామ్‌) గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది.

ఈ గణాంకాల ప్రకారం ఆగస్టులో 2,15,916 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. 2019 ఆగస్టులో ఈ సంఖ్య 1,89,129గా ఉండటం గమనార్హం.

మోటార్ సైకిళ్ల విక్రయాలు ఆగస్టులో భారీగా 10.13 శాతం పెరిగాయి. గత నెల మొత్తం 10,32,476 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2019 ఆగస్టులో 9,37,486 మోటార్​ సైకిళ్ల విక్రయాలు నమోదయ్యాయి.

స్కూటార్​ల విక్రయాలు మాత్రం ఆగస్టులో 12.3 శాతం తగ్గి.. 4,56,868 యూనిట్లుగా పరిమితమయ్యాయి. గత ఏడాది ఆగస్టులో 5,20,898 యూనిట్లు అమ్ముడైనట్లు సియామ్ తెలిపింది.

ఇదీ చూడండి:ఆ విమాన సంస్థలో 4,300 ఉద్యోగాలు కట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.