ETV Bharat / business

'కట్టడి చర్యలతో పారిశ్రామిక ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం' - Partial lockdown measures labour, goods

దేశవ్యాప్తంగా కొవిడ్​ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో భారత పరిశ్రమల సమాఖ్య ఓ సర్వే చేపట్టింది. ప్రభుత్వాలు చేపడుతున్న పాక్షిక లాక్​డౌన్​, మైక్రో కంటైన్మెంట్​ వంటి పద్ధతులతో పారిశ్రామిక రంగంపై ఎటువంటి ప్రభావం పడుతుంది? అనే దానిపై ప్రధానంగా సర్వే చేపట్టింది. ఈ విధానాలతో ముడిసరుకులపై, కార్మికులపై ఎక్కువగా ప్రభావం పడుతుందని తేలినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

Partial lockdown measures could impact movement of labour, goods: CII survey
'కట్టడి చర్యలతో పారిశ్రామిక ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం'
author img

By

Published : Apr 11, 2021, 3:23 PM IST

దేశవ్యాప్తంగా పెరుగుతోన్న కరోనా కేసుల దృష్ట్యా పాక్షిక లాక్​డౌన్ అమలు చేస్తే.. ఆ ప్రభావం కూలీలతో పాటు ముడి సరుకుల మీద కూడా పడుతుందని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) చేపట్టిన సర్వేలో తేలింది. అంతేగాక పారిశ్రామిక ఉత్పత్తి గణనీయంగా ప్రభావితం అవుతుందని స్పష్టం చేసింది.

కొవిడ్​ కర్య్ఫూ, మైక్రో కంటైన్మెంట్​ వంటి పద్ధతులతో పరిశ్రమలపై ఎటువంటి ప్రభావం ఉంటుంది? అనే దానిపై ప్రధానంగా ఈ సర్వే సాగింది. ఈ సర్వేలో వివిధ కంపెనీల సీఈఓలు పాల్గొన్నారు. వారిలో ఎక్కువమంది పాక్షిక లాక్​డౌన్​తో లేబర్​ కొరత ఏర్పడుతుందని తెలిపారు.

ఇలాంటి పరిణామాలతో పారిశ్రామిక ఉత్పత్తి గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నట్లు సీఐఐ ప్రెసిడెంట్​ టీవీ నరేంద్రన్​ వివరించారు. ఇందులో పాల్గొన్న సీఈఓలలో 56శాతం మంది పారిశ్రామిక ఉత్పత్తి 50శాతంకు కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు.

కార్మికుల ఆరోగ్యం, భద్రతకు సంబంధించి కఠిన చర్యలు అమలు చేయాల్సిన అవసరం ఉందని టీవీ నరేంద్రన్​ తెలిపారు. ఈ క్రమంలో వేడుకలకు దూరంగా ఉండాలన్నారు. ఈ విధమైన చర్యలతో పరిశ్రమలో పనితీరును మరింత పెంచుకోవాలని కోరారు. ఆంక్షల ప్రభావాన్ని తగ్గించడానికి 45ఏళ్లకు పైబడిన వారికి ప్రభుత్వంతో కలిసి సామూహిక టీకాలను వేయించాలని.. పోల్​లో పాల్గొన్న 67శాతం మంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:

క్రోమ్​ వాడుతున్నారా? అయితే జాగ్రత్త!

48 మంది బిలియనీర్లతో టాప్​-10లోకి ముంబయి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.