ETV Bharat / business

2045 వరకు చమురే ప్రధాన ఇంధన వనరా? - ఒపెక్ వరల్డ్ ఆయిల్ ఔట్​లుక్​

కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో.. విద్యుత్​ వాహనాల వినియోగం వైపు ప్రపంచం పరుగు పెడుతున్న తరుణంలో.. చమురు ఎగుమతి దేశాల సమాఖ్య 'ఒపెక్​' (OPEC World Oil Outlook) నివేదిక కీలక విషయాలు వెల్లడించింది. మరిన్ని దశాబ్దాల పాటు చమురే ప్రధాన ఇంధనంగా (OPEC forecast on OIL demand) ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఒపెక్ ఓ నివేదిక విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

OPEC World Oil Outlook
ఒపెక్​ ఇంధన డిమాండ్ అంచనాలు
author img

By

Published : Sep 29, 2021, 12:16 PM IST

మరిన్ని దశాబ్దాల పాటు చమురే ప్రధాన ఇంధన వనరుగా ఉంటుందని చమురు ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్‌ అంచనా వేసింది. చమురుతో కాలుష్యం పెరిగిపోతోందని, ప్రత్యామ్నాయ-పునరుత్పాదక ఇంధన వనరుల వైపు వివిధ దేశాలు దృష్టి సారిస్తున్న తరుణంలో ఒపెక్‌ ఇలా పేర్కొంది. సంపద తక్కువగా ఉన్న దేశాలు అధిక వృద్ధి, జీవన ప్రమాణాలు పెంచాలని ఆకాంక్షించడం చమురుకు గిరాకీ పెంచుతుందని తెలిపింది. వచ్చే నెలలో గ్లాస్గోలో వాతావారణంపై జరిగే శిఖరాగ్ర సమావేశం (క్లైమేట్‌ సమ్మిట్‌)లో ప్రపంచ దేశాలు వాతావరణ మార్పులపై చర్చించే అవకాశం ఉంది. ధనిక దేశాల్లో మాత్రం రహదారులపైకి విద్యుత్‌ వాహనాలు ఎక్కువగా రావడం వల్ల ప్రత్యామ్నాయ, పునరుత్పాదక ఇంధన వనరుల ఆవిష్కరణ కోసం ఒత్తిడి పెరుగుతుందగా, చమురుకు గిరాకీ తగ్గుతోందని వివరించింది. మిగతా దేశాల్లో ఆర్థిక వ్యవస్థల్ని విస్తరించేందుకు ఇంకా చమురే ప్రధాన వనరుగా ఉందని, 2045 వరకు ఇది కొనసాగుతుందని తమ 'వార్షిక ప్రపంచ చమురు భవిష్యత్‌ అంచనా' నివేదికలో ఒపెక్‌ తెలిపింది.

2020లో కొవిడ్‌ ప్రభావంతో చమురుకు గిరాకీ బాగా తగ్గినా, ఈ ఏడాది మళ్లీ పుంజుకుంటోందని, దీర్ఘకాలం ఇది కొనసాగుతుందని నివేదిక పేర్కొంది. అంతర్జాతీయంగా ప్రాథమిక ఇంధన గిరాకీ 2020-45 మధ్య కాలంలో 28 శాతం మేర పెరుగుతుందని అంచనా వేసింది.

ఒపెక్ నివేదిక ముఖ్యాంశాలు..

  • అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ 2045 నాటికి రెండింతలు అయ్యే అవకాశం ఉందని, జనాభా కూడా మరో 170 కోట్లు పెరగొచ్చని నివేదిక వివరించింది.
  • ప్రపంచంలో 2045 నాటికి మొత్తం వాహనాలు 110 కోట్ల నుంచి 260 కోట్లకు చేరతాయని, ఇందులో 50 కోట్లు విద్యుత్‌ వాహనాలు (మొత్తం వాహనాల్లో 20 శాతం) ఉండొచ్చని తెలిపింది.
  • చైనా, భారత్‌ వంటి దేశాల్లో పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న మధ్యతరగతి కుటుంబాల నేపథ్యంలో 2020-45 మధ్య కాలంలో చమురుకు గిరాకీ బాగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
  • 2045 నాటికి ప్రపంచ ఇంధన గిరాకీలో 28.1 శాతం వాటా చమురుకే ఉండొచ్చని, ఇప్పటితో పోలిస్తే మాత్రం 30 శాతం మేర తగ్గొచ్చని తెలిపింది. సహజ వాయువు 24.4 శాతం, బొగ్గు 17.4 శాతం మేర వాటా కలిగి ఉండొచ్చని, మిగతా వనరులుగా అణు (న్యూక్లియర్‌), జల విద్యుత్‌, బయోమాస్‌ ఇంధనం, గాలి, సౌర వంటి పునరుత్పాదక ఇంధనాలు కొనసాగొచ్చని పేర్కొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.