చైనా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన వన్‌ప్లస్ 8 ప్రోను అమెజాన్ ఇండియాలో గురువారం విక్రయాలు ప్రారంభించింది. నిమిషాల్లోనే పూర్తిగా అమ్ముడుపోయినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
భారత్- చైనా సరిహద్దు ఉద్రిక్తతల మధ్య చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని చాలా మంది పిలుపునిస్తున్నారు. సామాజిక మాధ్యమ వేదికల్లో బాయ్‌కాట్ చైనా అంటూ నినదిస్తున్నారు. కానీ, వన్‌ప్లస్ 8 అమ్మకాలు తీరు దీనికి భిన్నంగా ఉందని చెప్పవచ్చు.
వ్యతిరేకత పెరిగినా..
దేశంలోని వినియోగదారుల్లో చైనా వ్యతిరేక భావజాలం పెరిగిందని ఇటీవల కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. కరోనా మూలాలు చైనాలోని వుహాన్‌లో ఉండటమే ఇందుకు కారణమని ఈ అధ్యయనం అంచనావేసింది. సగానికిపైగా భారత వినియోగదారులు మేడ్ ఇన్ చైనా వస్తువులపై ప్రతికూల భావంతో ఉన్నట్లు తెలిపింది.
వన్ ప్లస్ 8 శ్రేణిని ఏప్రిల్‌లో విడుదల చేసింది సంస్థ. అయితే లాక్డౌన్ కారణంగా భారత్‌లో మే 18న వన్‌ప్లస్ 8 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయగా జూన్ 15న వన్‌ప్లస్ 8 ప్రోను అందుబాటులోకి తెచ్చింది. వన్‌ప్లస్, అమెజాన్.. ఎన్ని ఫోన్లు అమ్మారో స్పష్టత ఇవ్వలేదు. అయితే భారత్‌లో వన్‌ప్లస్ ఫోన్లకు డిమాండ్ అధికంగానే ఉంది. ఫలితంగా నిమిషాల్లోనే అన్ని అమ్ముడుపోయినట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
-
OnePlus 8 Pro 5G and OnePlus 8 5G are available now on a limited drop!
— OnePlus India (@OnePlus_IN) June 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Get up to INR 3000 off on SBI Credit cards and 12 mon No Cost EMI.
Get yours - https://t.co/yk3nzoHcs3
Pair up with the OnePlus Warp Charge 30 Wireless Charger, available here - https://t.co/6okI1jJV7l pic.twitter.com/zEs1RsaxHJ
">OnePlus 8 Pro 5G and OnePlus 8 5G are available now on a limited drop!
— OnePlus India (@OnePlus_IN) June 15, 2020
Get up to INR 3000 off on SBI Credit cards and 12 mon No Cost EMI.
Get yours - https://t.co/yk3nzoHcs3
Pair up with the OnePlus Warp Charge 30 Wireless Charger, available here - https://t.co/6okI1jJV7l pic.twitter.com/zEs1RsaxHJOnePlus 8 Pro 5G and OnePlus 8 5G are available now on a limited drop!
— OnePlus India (@OnePlus_IN) June 15, 2020
Get up to INR 3000 off on SBI Credit cards and 12 mon No Cost EMI.
Get yours - https://t.co/yk3nzoHcs3
Pair up with the OnePlus Warp Charge 30 Wireless Charger, available here - https://t.co/6okI1jJV7l pic.twitter.com/zEs1RsaxHJ
వన్‌ప్లస్ 8 ప్రత్యేకతలు..
6.55 అంగుళాల తెర
మూడు రంగుల్లో లభ్యం
స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్
12 జీబీ ర్యామ్- 256 జీబీ స్టోరేజ్
వెనుకవైపు మూడు కెమెరాలు
4300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
వన్‌ప్లస్ 8 ప్రో
6.67 అంగుళాల క్వాడ్ హెచ్డీ +120 హెర్జ్ స్క్రీన్
5 జీ సపోర్ట్‌తో స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్
12 జీబీ ర్యామ్- 256 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్
వెనుక భాగంలో రెండు 48 ఎంపీ సెన్సార్లతో క్వాడ్-కెమెరా సెటప్-
20 ఎంపీ సెల్ఫీ షూటర్
4710 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
30 వోల్ట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్
ఐపీ 68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్
ఇదీ చూడండి: భారత్‌లో చైనా వస్తువులను నిషేధిస్తే నష్టమెవరికి?