ETV Bharat / business

ఆధార్‌తో పాన్‌ కార్డు లింక్ చేశారా..?

ఆధార్‌తో పాన్‌ కార్డు జతచేయాలని ఎస్బీఐ తమ ఖాతాదారులకు తెలిపింది. జూన్‌ 30 లోగా చేయాలని సూచించింది. ఈ మేరకు తన అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా వెల్లడించింది.

author img

By

Published : Jun 7, 2021, 5:38 AM IST

sbi
ఆధార్‌తో పాన్‌ కార్డు లింక్

ఆధార్‌తో పాన్‌ కార్డు జత చేయడానికి ఈ నెల 30 వరకే అవకాశముందని ఎస్బీఐ తమ ఖాతాదారులకు గుర్తు చేసింది. ఎలాంటి అంతరాయాలూ లేకుండా బ్యాంకు ద్వారా సేవలను పొందేందుకు నిర్ణీత గడువులోగా ఆధార్‌తో పాన్‌ కార్డు లింక్‌ చేయాలని ఎస్బీఐ తన ఖాతాదారులకు సూచించింది. ఈ మేరకు తన అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా వెల్లడించింది.

నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే బ్యాంకుకు సంబంధించిన పలు లావాదేవీలకు పాన్‌ కార్డు పనిచేయదని హెచ్చరించింది. పాన్‌ కార్డును ఆధార్‌తో జత చేయడానికి ఈ ఏడాది మార్చి 31 వరకే అవకాశం ఉండగా.. కొవిడ్‌ నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ ఈ గడువును మూడు నెలలు పెంచుతూ జూన్‌ 30 వరకు పొడిగించింది.

ఎవరైనా తమ ఆధార్‌తో పాన్‌ కార్డును నిర్ణీత గడువులోగా జత చేయకపోతే ఆలస్య రుసుము కింద రూ.1000 వరకు జరిమానా విధించేలా ప్రభుత్వం ఫైనాన్స్‌ బిల్లు-2021లో సవరణను పొందుపరిచింది.

ఇదీ చదవండి : భారత్​ నుంచి పారిపోలేదు: మెహుల్‌ చోక్సీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.