ETV Bharat / business

మీరు నిద్రపోవడం మర్చిపోతే యూట్యూబ్​ గుర్తు చేస్తుంది!

యూట్యూబ్​ చూస్తూ నిద్రపోయే సమయాన్ని కూడా మర్చిపోతున్నారా? మీలాంటి వారికోసమే యూట్యూబ్​ సరికొత్త ఫీచర్​ని తీసుకొచ్చింది. మీరు నిద్రించే సమయాన్ని గుర్తు చేసేలా 'బెడ్​టైమ్​ రిమైండర్'​ని ప్రవేశపెట్టింది.

Leading social giant Facebook has launched a new Future for Profile pic lock.
మీరు నిద్రపోవడం మర్చిపోతే యూట్యూబ్​ గుర్తు చేస్తుంది!
author img

By

Published : May 27, 2020, 10:56 AM IST

గత కొంతకాలంగా లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమయ్యారు జనం. దీంతో స్మార్ట్‌ఫోనే తమ బెస్ట్‌ఫ్రెండ్‌ అయిపోయింది. దీంతో వీడియో స్ట్రీమింగ్‌ల రేటు చాలా వరకు పెరిగిపోయింది. నెట్‌ఫ్లిక్స్‌, యూట్యూబ్‌ వీడియోలు చూస్తూ ఎప్పుడు నిద్రిస్తున్నామో, ఎప్పుడు లేస్తున్నామో కూడా తెలీని పరిస్థితి. అందుకే యూట్యూబ్‌ మీ నిద్రకి ఆటంకం కలిగించకూడదనుకుంది. అందుకు సరికొత్త ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. అదే ‘బెడ్‌టైమ్‌ రిమైండర్‌’. దీంతో మీరు నిద్రించాలనుకున్న సమయాన్ని ముందే యూట్యూబ్‌కి చెబితే చాలు. ఆ సమయంలో మీకు రిమైండ్‌ చేస్తుంది. అందుకు యూట్యూబ్‌ సెట్టింగ్స్‌లో స్టార్ట్‌, ఎండ్‌ టైమ్‌లను సెట్‌ చేసుకోవాలి.

ఎండ్‌ సమయానికి చూస్తున్న వీడియో కాస్త ఉండిపోతే 'వెయిట్‌ అంటిల్‌ ద వీడియో ఈజ్‌ ఓవర్‌' ఆప్షన్‌ని క్లిక్‌ చేయొచ్ఛు అంతేకాదు రిమైండర్‌ని స్నూజ్‌ చేయొచ్ఛు డిస్‌మిస్‌ చేయొచ్చు కూడా. ఈ ఫీచర్‌ త్వరలో ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ డివైజ్‌లో అందుబాటులోకి రానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.