కరోనాతో విధించిన లాక్డౌన్ కారణంగా సంస్థలన్నీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ మాత్రం లాభాల బాటలో పయనిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఈ ప్రముఖ ఫార్మా సంస్థ.. 2019-20 సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రెట్టింపు లాభాలు అందుకుంది.
గతేడాది నాలుగో త్రైమాసికంలో నికర లాభం రూ. 343 కోట్ల కాగా.. ప్రస్తుతం రూ.764 కోట్ల లాభాలను అర్జించింది. బుధవారం హైదరాబాద్లో ఫలితాలను ప్రకటించింది సంస్థ. 2018-19 నాలుగో త్రైమాసికంతో పోల్చితే ఆదాయం కూడా పది శాతం పెరిగి.. అర్జన రూ. 4432 కోట్లకు చేరింది.
సంస్థ ఉత్పత్తుల విక్రయాల్లో 5 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం రూ. 683.6 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి. ఫలితంగా ఉత్తర అమెరికాలో 21 శాతం వృద్ధి, ఐరోపాలో 80 శాతం, ఎమర్జింగ్ మార్కెట్లలో 15 శాతం పెరుగుదల నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా సంస్థ జనరిక్ ఔషధాల అమ్మకాల్లోనూ.. 20 శాతం వృద్ధి నమోదైందని తెలిపింది.